ఆస్ట్రేలియా క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్.. ఆటకు తాత్కాలిక విరామం ప్రకటించాడు. మానసిక సమస్యల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నాడని క్రికెట్ ఆస్ట్రేలియా తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది.
మ్యాక్స్‌వెల్ గురించి క్రికెట్ ఆస్ట్రేలియా ట్వీట్ "గ్లెన్ మ్యాక్స్‌వెల్.. ప్రస్తుతం విపరీతమైన మానసిక సమస్యతో బాధపడుతున్నాడు. ఫలితంగా కొద్దిరోజులు క్రికెట్‌కు దూరంగా ఉండనున్నాడు" -డాక్టర్ మైఖేల్ లాయిడ్, జట్టు సైకాలజిస్ట్
ప్రస్తుతం శ్రీలంకతో టీ20 సిరీస్ ఆడుతున్నాడు మ్యాక్స్‌వెల్. ఇప్పుడు అతడి స్థానాన్ని షార్ట్‌తో భర్తీ చేయనుంది. శుక్రవారం ఈ రెండు జట్ల మధ్య చివరి మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే 2-0 తేడాతో ఈ సిరీస్‌ను కంగారూలు కైవసం చేసుకున్నారు.
ఆస్ట్రేలియా క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఇది చదవండి: ఆసీస్‌దే రెండో టీ20... సిరీస్ కైవసం