ఐసీసీ మహిళా టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్‌కు రిజర్వ్‌డే కేటాయించకపోవటాన్ని ఖండించాడు ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మార్క్ వా. దీనివల్ల జీవితకాలంలోనే అతిపెద్ద మ్యాచ్ ఆడే అవకాశాన్ని కొందరు క్రికెటర్లు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశాడు.
గురువారం జరగాల్సి ఉన్న తొలి సెమీస్‌లో భారత్, ఇంగ్లాండ్ తలపడాల్సి ఉంది. సిడ్నీలో కుండపోతగా వర్షం కురవడం వల్ల ఒక్క బంతీ పడకుండానే ఈ మ్యాచ్ రద్దైంది. వర్షం కురిసే అవకాశాలు ఉండటం వల్ల రిజర్వు డే కేటాయించాలని క్రికెట్ ఆస్ట్రేలియా ముందుగానే అంతర్జాతీయ క్రికెట్ మండలిని కోరింది. అయినప్పటికీ కుదరదని ఐసీసీ చెప్పడం గమనార్హం. దీంతో లీగ్ దశలో నాలుగు విజయాలతో 8 పాయింట్లు సాధించిన టీమిండియా ఫైనల్‌కు చేరింది. మూడు విజయాలే సాధించిన ఇంగ్లాండ్ నిరాశగా నిష్ర్కమించింది.
"ఈ ఏడాది అతిపెద్ద క్రికెట్ టోర్నీ నాకౌట్ మ్యాచ్‌లకు ఐసీసీ రిజర్వు డే కేటాయించకపోవడం పూర్తిగా అర్థరహితం. దీనివల్ల జీవితకాలంలో అతిపెద్ద మ్యాచ్ ఆడే అవకాశాన్ని కొందరు క్రికెటర్లు కోల్పోయారు."