పరిమిత ఓవర్ల సిరీస్ ఆడేందుకు ఇంగ్లాండ్ వెళ్లిన ఆస్ట్రేలియా క్రికెటర్లు ఫుల్ జోష్‌లో ఉన్నారు. ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంటున్నారు. అయితే జిమ్‌లో మిచెల్ మార్ష్, ఆడమ్ జంపా, స్టోయినిస్ డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది క్రికెట్.కామ్.ఏయూ.
జిమ్‌లో ఆసీస్ క్రికెటర్ల డ్యాన్స్
ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు సిద్ధమవుతున్న ఆసీస్ క్రికెటర్లు.. ప్రాక్టీసు సెషన్స్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. జిమ్‌లో డ్యాన్స్‌లు కూడా వేస్తున్నారు.
ఆసీస్ క్రికెటర్ల డ్యాన్స్ హంగామా
శిక్షణలో భాగంగా జిమ్‌లో కసరత్తులు చేస్తోన్న మార్ష్, జంపా, స్టోయినిస్.. సరదాగా డ్యాన్స్ వేస్తూ ఎంజాయ్ చేశారు. మ్యూజిక్ తగ్గట్లు స్టెప్పులు వేసి అదరగొట్టారు. వీడియో గేమ్స్ కూడా ఆడుతూ సరదాగా కనిపించారు. సెప్టెంబరు 4 నుంచి 16 వరకు ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా మధ్య బయోసెక్యూర్ వాతావరణంలో మ్యాచ్‌లు జరగనున్నాయి.
ఇది చూడండి నాలుగేళ్లలో కోహ్లీలో చాలా మార్పు: జేమ్స్ అండర్సన్