అది 1987 ప్రపంచకప్.. లాహోర్‌లో వెస్టిండీస్- పాకిస్థాన్ మధ్య ఉత్కంఠభరితంగా మ్యాచ్ జరుగుతుంది. చివరి బంతికి ఆరు పరుగులు కొట్టాలి. విండీస్ బౌలర్ వాల్ష్ బౌలింగ్. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న సలీమ్ జాఫర్ క్రీజు నుంచి బయటికొచ్చాడు. అప్పటికీ మూడు సార్లు హెచ్చరించాడు వాల్ష్. అయినా క్రీజు దాటాడు సలీం. ఆ క్షణంలో వాల్ష్ మన్కడింగ్ ద్వారా అతడ్ని ఔట్ చేసుంటే విండీస్ మ్యాచ్ గెలిచేదే. కానీ అలా చేయలేదు క్రీడా స్ఫూర్తితో వదిలేశాడు. ఫలితం స్ట్రైకింగ్ చేస్తున్న అబ్దుల్ ఖాదీర్ సిక్సర్ కొట్టి పాక్‌కు విజయం చేకూర్చాడు. క్రీడాస్ఫూర్తి ప్రదర్శించిన వాల్ష్కు జియా ఉల్ హఖ్ పతకాన్నిచ్చి గౌరవించింది పాకిస్థాన్.
మన్కడింగ్.... ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే హాట్ టాపిక్. సోమవారం రాజస్థాన్, పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో బట్లర్‌ని అశ్విన్ మన్కడింగ్ ద్వారా ఔట్ చేశాడు. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు మన్కడింగ్ అంటే ఏంటి? ఇలాంటి ఘటనలు ఇంతకుముందు ఎప్పుడు జరిగాయో తెలుసుకుందాం.
- మన్కడింగ్ అంటే ఏంటి?
నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్ క్రీజులో నుంచి ముందుకు కదిలినపుడు బౌలర్ రనౌట్ చేసే విధానాన్ని మన్కడింగ్ అంటారు. బ్యాట్స్‌మెన్ క్రీజులో నుంచి బయటికొస్తున్నపుడు ముందస్తుగా హెచ్చరించాలనేది సంప్రదాయం. అలా కాకుండా ఔట్ చేయడం క్రీడాస్ఫూర్తికి వ్యతిరేకమని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
- తొలిసారి ఎప్పుడు జరిగింది?