రింగులో ఎందరో మహామహుల్ని మట్టి కరిపించిన గొప్ప బాక్సర్ ఫ్లాయిడ్ మేవెదర్. వృత్తిపరంగా 50 సార్లు రింగులో తలబడగా.. అసలు ఓటమనేది లేకుడా రికార్డు సృష్టించాడు. చివరగా 2018లో బాక్సింగ్ పోటీల్లో పాల్గొన్నాడు మేవెదర్. అయితే క్రికెట్లో అంతటి భయంకరమైన బాక్సర్‌కు సమానమైన ఆటగాడు ఎవరో తెలుసా?
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ను ప్రముఖ బాక్సింగ్ ఛాంపియన్.. ఫ్లాయిడ్ మేవెదర్‌తో పోల్చాడు ఆ దేశ కోచ్ జస్టిన్ లాంగర్. ఈ క్రమంలోనే 2018 బాల్ ట్యాంపరింగ్ కారణంగా వార్నర్ కెప్టెన్సీపై జీవితకాలం నిషేధం గురించి కూడా స్పందించాడు. 2018 మార్చిలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడినందుకు అప్పటి కెప్టెన్ స్టీవ్‌స్మిత్, వార్నర్‌లకు ఏడాది పాటు నిషేధం విదించింది.
"చూడండి, నేను అతనికి మద్దుతుగా ఉంటా. జట్టులో డేవిడ్ వార్నర్ ఉంటడమంటే బాక్సర్ ఫ్లాయిడ్ మేవెదర్‌ను కలిగి ఉన్నట్లే. అధికారికంగా అతను ఆస్ట్రేలియాకు తిరిగి కెప్టెన్ కాకుండా నిషేధించారు. వార్నర్ మళ్లీ సారథిగా వస్తాడని మేము అనుకోవడం లేదు. కానీ, జట్టులో అతను ఉంటే చాలు. వార్నర్ అద్భుతమైన ఆడగాడు."