తెలంగాణ

telangana

ETV Bharat / sports

'దేశం కోసం ఒక్కరోజు సెలవు పెట్టండి' - ప్రజాస్వామ్యం

"మనందరం మనకిష్టమైన వాళ్లకోసం ఎంత దూరమైనా వెళ్తుటాం. స్నేహితులను, కుటుంబాన్ని కలవడానికి, ఇష్టమైన ఆహారం, జ్ఞాపకాల కోసం ప్రయాణాలు చేస్తుంటాం. ఈ సారి మరొక ప్రేమకోసం సెలవు తీసుకుందాం. దేశం మీద అభిమానాన్ని ఓటుతో చాటిచెబుదాం" అంటూ ఓ సంస్థ చేసిన ట్వీట్​కు స్పందించాడు మాజీ క్రికెటర్​ వీరేంద్ర సెహ్వాగ్​.

'దేశం కోసం ఒక్కరోజు సెలవు పెట్టండి'

By

Published : Apr 10, 2019, 10:26 PM IST

మీ అమూల్యమైన ఓటు వేసేందుకు ఒక్క రోజు సెలవు తీసుకొని దేశం మీద ప్రేమను చాటుకోండి అంటూ వీడియో రూపొందించింది ఓ సంస్థ. ఆ వీడియో చూసిన భారత మాజీ క్రికెటర్​ వీరేంద్ర సెహ్వాగ్​ "ఈ వీడియో నా మనసు దోచేసింది. పదండి అందరం వెళ్లి మన కర్తవ్యాన్ని నిర్వర్తిద్దాం" అంటూ పిలుపునిచ్చాడు. "ఒక్కరోజు సెలవు తీసుకొని పోలింగ్​ బూత్​ చేరుకుందాం. మన ఓటును వినియోగించుకుందాం అంటూ ఆ వీడియో ద్వారా సందేశాన్ని షేర్​ చేశాడు సెహ్వాగ్​.

ABOUT THE AUTHOR

...view details