కుల్దీప్ యాదవ్ లాంటి ఎడమ చేతివాటం మణికట్టు మాంత్రికుడు అంత తేలిగ్గా దొరకడని టీమ్‌ఇండియా మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. కుల్దీప్కు రాబోయే టెస్టు సిరీస్‌లో కచ్చితంగా తుది జట్టులో చోటు దక్కుతుందని ఇర్ఫాన్ ఆశిస్తున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌కు ఎంపికైనా కుల్దీప్కు అవకాశం దక్కలేదు. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్‌తో జరగబోయే నాలుగు టెస్టుల సిరీస్‌లో అవకాశం వస్తే రాణిస్తాడని పఠాన్ పేర్కొన్నాడు.
"తుది జట్టులో అవకాశం దక్కని ఆటగాళ్ల పట్ల జట్టు యాజమాన్యం సరైన పద్ధతిలో వ్యవహరిస్తోందని నేను ఆశిస్తున్నా. వారిని మానసికంగా దృఢంగా ఉంచడం ఎంతో ముఖ్యం. అందుకే ఇటీవల యువకులు బాగా రాణించిన సందర్భాలను మనం చూశాం. అలాగే కుల్‌దీప్ విషయంలోనూ జట్టు అండగా ఉందని అనుకుంటున్నా. అతడో వైవిధ్యమైన బౌలర్. అతడికిప్పుడు 25-26 ఏళ్లు ఉంటాయి. ఈ వయసులోనే పరిణతి చెందుతాడు. రాబోయే సిరీస్‌లో ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు రాణించడానికి సిద్ధంగా ఉంటాడు."