ఐపీఎల్ గత రెండు సీజన్లలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు నాయకత్వం వహించాడు రవిచంద్రన్ అశ్విన్. ఇప్పుడు అతడిని పంజాబ్ వదులుకుంది. వచ్చే సీజన్లో దిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడనున్నాడీ స్పిన్నర్. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇప్పటికే అశ్విన్ రిలీవింగ్ ప్రక్రియ పూర్తయిందని, బీసీసీఐ అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అతడిని తీసుకునేందుకు దిల్లీ క్యాపిటల్స్ సముఖుత వ్యక్తం చేసింది.