తెలంగాణ

telangana

ETV Bharat / sports

రసెల్ జోరుకు రబాడ అడ్డుకట్ట వేస్తాడా? - kolkata knight riders

కోల్​కతా వేదికగా నేడు దిల్లీ క్యాపిటల్స్​తో కోల్​కతా నైట్ రైడర్స్ తలపడనుంది. అందరి దృష్టి కోల్​కతా విధ్వంసకర బ్యాట్స్​మెన్ రసెల్​పైనే ఉంది.

ఐపీఎల్

By

Published : Apr 12, 2019, 6:00 AM IST

ఈడెన్​ గార్డెన్స్​ వేదికగా నేడు కోల్​కతా నైట్​ రైడర్స్​, దిల్లీ క్యాపిటల్స్​ జట్లు తలపడనున్నాయి. ప్రతి మ్యాచ్​లో చెలరేగుతూ జట్టుకు విజయాలనందిస్తున్న ఆటగాడు కోల్​కతా ఆల్ రౌండర్ ఆండ్రీ రసెల్. తన పదునైన యార్కర్లతో ఎలాంటి బ్యాట్స్​మెన్​ను అయిన బోల్తా కొట్టించగలడు దిల్లీ జట్టు బౌలర్ రబాడ. వీరి మధ్య పోరు కోసం అభిమానులు ఆసక్తికరంగా వేచి చూస్తున్నారు.

ఈ రెండు జట్లు తలపడిన తొలి మ్యాచ్​లో సూపర్ ఓవర్​లో విజయం సాధించింది దిల్లీ క్యాపిటల్స్.

సూపర్ ఓవర్​లో 11 పరుగులు చేయల్సి ఉండగా మొదటి బంతికే రబాడా.. రసెల్​ని క్లీన్ బౌల్డ్ చేశాడు. అద్భుతంగా బౌలింగ్​ చేసి దిల్లీకి విజయాన్నందించాడు. ఈ మ్యాచ్​లోనూ రబాడ.. రసెల్​కు మరోసారి అడ్డుకట్ట వేయాలని దిల్లీ అభిమానులు కోరుకుంటున్నారు.

ఆడిన ఆరింటిలో నాలుగు మ్యాచ్​లు గెలిచిన కోల్​కతా పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఐదు మ్యాచ్​ల్లో 212 స్ట్రైక్ రేట్​తో 257 పరుగులు చేసి నైట్ రైడర్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు రసెల్. అందులో 150 పరుగులు సిక్స్​ల ద్వారానే వచ్చాయి.

చెన్నై, దిల్లీతో మాత్రమే ఓడిపోయింది కోల్​కతా జట్టు. అందులో దిల్లీతో సూపర్ ఓవర్లో పరాజయం పాలైంది. కార్తీక్, నితీష్ రానా, ఊతప్ప, రసెల్​లతో బ్యాటింగ్ లైనప్ సమతూకంగా ఉంది. రసెల్ మరోసారి బ్యాట్​కు పనిచెప్పాలని కోల్​కతా అభిమానులు కోరుతున్నారు.

సీజన్​లో నాలుగో విజయాన్ని సాధించి పాయింట్ల పట్టికలో మొదటి నాలుగు స్థానాల్లో నిలవాలని భావిస్తోంది దిల్లీ జట్టు. కోల్​కతాపై గత మ్యాచ్​లో గెలవడం క్యాపిటల్స్​కు కలిసొచ్చే అంశం. పేసర్ రబాడ, ఇషాంత్ శర్మ, క్రిస్ మోరిస్, అక్షర్ పటేల్​లతో బౌలింగ్ విభాగం పటిష్ఠంగా ఉంది. బ్యాట్స్​మెన్​ శిఖర్ ధావన్, పృథ్వీ షా, ఇన్​గ్రామ్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్ సత్తా చాటాలని భావిస్తున్నారు.

జట్లు అంచనా..
దిల్లీ క్యాపిటల్స్
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), ఇషాంత్ శర్మ,
పృథ్వీషా, శిఖర్ ధావన్, కొలిన్ ఇన్​గ్రామ్​, క్రిస్ మోరిస్, అక్షర్ పటేల్, రబాడ, రాహుల్ తెవాతియా, రిషభ్ పంత్, సందీప్ లమిచానే

కోల్​కతా నైట్ రైడర్స్
దినేష్ కార్తీక్ (కెప్టెన్), పియూష్ చావ్లా, రాబిన్ ఊతప్ప, సునీల్ నరైన్, హారీ గున్రే, ఆండ్రీ రసెల్, క్రిస్ లిన్, కుల్దీప్ యాదవ్, నితీష్ రానా, ప్రసిద్ధ్​ కృష్ణ, శుభమన్ గిల్

ABOUT THE AUTHOR

...view details