తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా కెప్టెన్ కోహ్లీ రనౌట్ మ్యాచ్ గమనాన్నే మార్చేసిందని ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లైయన్ చెప్పాడు. విరాట్, పుజారా లాంటి ఆటగాళ్లకు బంతులేయడం సవాల్ లాంటిదని అన్నాడు.
"కోహ్లీ చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. కానీ అతడు రనౌట్ కావడం అనుహ్య పరిణామం. విరాట్, పుజారా లాంటి గొప్ప ఆటగాళ్లను ఎదుర్కోవడం ఓ సవాల్. స్పిన్ బౌలింగ్‌ను ఆడటంలో వారిద్దరి బ్యాటింగ్ శైలి విభిన్నంగా ఉంటుంది. ఈ రోజు మా ఆటగాళ్ల ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నాను. బౌలింగ్ అద్భుతంగా చేశారు. అయినప్పటికీ మా ప్రదర్శన మరింత మెరుగుపరుచుకోవాలి"