తెలంగాణ

telangana

ETV Bharat / sports

'కోహ్లీ వ్యాఖ్యలు కోచ్ ఎంపికను ప్రభావితం చేయలేదు' - kapil dev

కోచ్ ఎంపికలో కోహ్లీ మాటలు పరిగణలోకి తీసుకోలేదని అన్నాడు సీఏసీ సభ్యుడు కపిల్ దేవ్. అన్ని అంశాలు పరిగణలోకి తీసుకునే నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశాడు.

కపిల్

By

Published : Aug 17, 2019, 7:31 AM IST

Updated : Sep 27, 2019, 6:18 AM IST

టీమిండియా కోచ్​గా రవిశాస్త్రి మరోసారి ఎంపికయ్యాడు. కపిల్​ దేవ్ నేతృత్వంలోని క్రికెట్ సలహా కమిటీ రవిభాయ్​కు బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఎంపిక అనంతరం కపిల్​ మాట్లాడుతూ.. శాస్త్రికి కోహ్లీ మద్దతు తెలిపినా.. అది మా నిర్ణయాన్ని ప్రభావితం చేయలేదని తెలిపాడు.

"కోహ్లీ మాటలు కోచ్ ఎంపికను ప్రభావితం చేయలేదు. అతడి వ్యాఖ్యలు పరిగణలోకి తీసుకుంటే మిగతా ఆటగాళ్ల సూచనలు పరిశీలించాలి. మే ఎవ్వరినీ అడగలేదు. అందుకు ఆస్కారం లేదు. ప్రపంచకప్​ గెలవనంత మాత్రాన ఓ మేనేజర్​ని తీసిపారేయలేం. అన్ని అంశాలను పరిశీలించాకే నిర్ణయం తీసుకున్నాం".
-కపిల్ దేవ్, సీఏసీ సభ్యుడు

కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్న మిగతా వారితో పోలిస్తే రవిశాస్త్రి రికార్డు బాగుండటమే అతడిని ఆ పదవికి అర్హుడయ్యేలా చేసింది. టెస్టుల్లో జట్టును నంబర్​ వన్​గా నిలపడం, ఆసీస్ గడ్డపై చారిత్రక సిరీస్​ గెలవడం రవిభాయ్​కు పేరు తెచ్చాయి.

"అందరూ ప్రతిభావంతులే. కొన్ని సార్లు రవిశాస్త్రి మిగతావారి కంటే ఎక్కువ మార్కులు సంపాందించాడు. అందరి ప్రెజెంటేషన్స్​ చూశాకే కోచ్​ను ఎంపిక చేశాం. ప్రస్తుతం జట్టుతో ఉండటం శాస్త్రికి కలిసొచ్చింది. టీం బలాబలాలు అతడికి బాగా తెలుసు".
-కపిల్ దేవ్, సీఏసీ సభ్యుడు

కోచ్ పదవికి దరఖాస్తు చేసిన వారిలో మాజీ టీమిండియా ఆటగాళ్లు రాబిన్​ సింగ్, లాల్​చంద్ రాజ్​పుత్, కివీస్ మాజీ ఆటగాడు మైక్ హెసన్, ఆస్ట్రేలియన్ టామ్ మూడీకి నిరాశే మిగిలింది.

ఇవీ చూడండి.. టీమిండియా కోచ్: రవి భాయ్​కే మళ్లీ పట్టం

Last Updated : Sep 27, 2019, 6:18 AM IST

ABOUT THE AUTHOR

...view details