సచిన్ తెందుల్కర్..క్రికెట్ చరిత్రలో ఓ దిగ్గజం. అద్భుత బ్యాటింగ్‌తో ఎన్నో రికార్డులు సృష్టించాడు. ఎవరికీ సాధ్యం కాని ఎన్నో ఘనతలు సాధించాడు. ఇప్పుడు వాటిని అధిగమించి దూసుకెళ్తున్నాడు టీమ్ఇండియా ప్రస్తుత సారథి కోహ్లీ. ఆగస్టు 18తో కోహ్లీ 12 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్ పూర్తయింది. ఈ ప్రయాణంలో ఎన్నో ఘనతలు సాధించి.. అగ్రశ్రేణి బ్యాట్స్‌మన్‌గా ఎదిగాడు. పరుగుల వరద పారిస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే పన్నెండేళ్ల కెరీర్లో సచిన్, కోహ్లీ రికార్డులు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.
వన్డేల్లో కోహ్లీ-సచిన్
సచిన్ 86.49 స్ట్రైక్‌రేట్‌తో 10,803 పరుగులు చేశాడు. ఇందులో 31 శతకాలు, 53 అర్థ శతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 186 నాటౌట్. కోహ్లీ 93.25 స్ట్రైక్‌రైట్‌తో 11,867 పరుగులు చేశాడు. 43 సెంచరీలు, 58 అర్థ సెంచరీలు నమోదు చేశాడు. అత్యధిక స్కోరు 183. ప్రస్తుతం ఐసీసీ బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు విరాట్.
టెస్టుల్లో 86 మ్యాచులాడిన కోహ్లీ.. 53.26 స్ట్రైక్‌రేట్‌తో 7,240 పరుగులు చేశాడు. ఇందులో 27 శతకాలు ఉండటం విశేషం.