తెలంగాణ

telangana

ETV Bharat / sports

కోహ్లీ నాలుగులో!

ఆసీస్​తో శనివారం ప్రారంభమయ్యే వన్డే సిరీస్​లో కోహ్లీ నాలుగో స్థానంలో బ్యాటింగ్​కు రావాలని జట్టు భావిస్తోంది.

కోహ్లీ

By

Published : Mar 1, 2019, 5:51 PM IST

Updated : Mar 1, 2019, 11:23 PM IST

ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ కోల్పోయిన భారత్.. వన్డేలపై దృష్టి పెట్టింది. ప్రపంచకప్​కు ముందు జరిగే ఆఖరి సిరీస్ ఇదే. టీం బ్యాటింగ్ ఆర్డర్, తుది జట్టు ఎంపికలో ఈ సిరీస్ ముఖ్యపాత్ర పోషించనుంది. బలాబలాలు, ప్రయోగాలకూ ఇదే చివరి అవకాశం.

రిషబ్ పంత్, విజయ్ శంకర్​లు తమ స్థానాలు పదిలం చేసుకోవాలని భావిస్తున్నారు. టీ20ల్లో సత్తాచాటిన రాహుల్ వన్డే సిరీస్​లోనూ నిలకడగా రాణించాలని జట్టు ఆశిస్తోంది.

రాహుల్ మూడోస్థానంలో బ్యాటింగ్​కు దిగితే కోహ్లీ నాలుగో స్థానంలో ఆడాల్సి వస్తుంది. కోచ్ రవిశాస్త్రి ఈ విషయమై స్పష్టతనిచ్చాడు. కోహ్లీ నాలుగో స్థానంలో ఆడతాడని.. ఒక్క స్థానం దిగువన రావడం వల్ల ఇబ్బందేమీ ఉండదని స్పష్టం చేశాడు

మాక్స్​వెల్​ను బ్యాటింగ్ ఆర్డర్​లో ముందుకు పంపాలని అనుకుంటోంది ఆసీస్ జట్టు. టీ20 సిరీస్​లో ఏడో స్థానంలో దిగి రెచ్చిపోయిన ఈ విధ్వంసకర బ్యాట్స్​మెన్​ను వన్డేల్లో ముందుకు పంపిస్తామని కెప్టెన్ ఫించ్ తెలిపాడు.

వన్డేల్లో చివరి స్థానాల్లో బ్యాటింగ్ చేయడం కష్టమని.. నాలుగు, ఐదు స్థానాల్లో కొంచెం ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగొచ్చని మాక్స్​వెల్ తెలిపాడు.
శనివారం నాడు హైదరాబాద్​ ఉప్పల్​ స్టేడియంలో జరిగే తొలి వన్డేతో కంగారూలతో సిరీస్ ప్రారంభం అవుతుంది.

Last Updated : Mar 1, 2019, 11:23 PM IST

ABOUT THE AUTHOR

...view details