తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆలస్యానికి మూల్యం చెల్లించుకున్న కోహ్లీ - విరాట్​ కోహ్లీ

మొహాలీలో కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​తో జరిగిన మ్యాచ్​లో  స్లో ఓవర్​ రేటు కారణంగా జరిమానా ఎదుర్కొన్నాడు బెంగళూరు సారథి కోహ్లీ. ఈ సీజన్​లో తొలిసారి విరాట్​కు ఫీజు కోత పడింది.

ఆలస్యానికి మూల్యం చెల్లించుకున్న విరాట్​ కోహ్లీ

By

Published : Apr 14, 2019, 11:51 AM IST

ఐపీఎల్‌లో స్లో ఓవర్​ రేటుకు మూల్యం చెల్లించుకున్నాడు విరాట్ కోహ్లీ. శనివారం బెంగళూరు-కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ మధ్య జరిగిన మ్యాచ్​లో స్లో ఓవర్​ నమోదైంది. ఫలితంగా కోహ్లీకి రూ.12లక్షలు జరిమానా పడింది. ఈ మ్యాచ్​తో తొలి విజయం అందుకున్న కోహ్లీ మొదటిసారి మ్యాచ్​ ఫీజులో కోత ఎదుర్కొన్నాడు.

  • ఇంతకు ముందు రోహిత్‌ శర్మకు ఇదే తరహాలో ఫైన్‌ పడింది. ముంబయి ఇండియన్స్‌- కింగ్స్‌లెవన్‌ పంజాబ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ముంబయి జట్టు తరఫున స్లో ఓవర్ రేట్‌ నమోదైంది. ఆ జట్టు సారథి రోహిత్‌కు జరిమానా ఎదుర్కొన్నాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో... స్లో ఓవర్ రేట్ కారణంగానే రాజస్థాన్​ సారథి అజింక్యా రహానేకు జరిమానా విధించారు.

ABOUT THE AUTHOR

...view details