మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్ పేరిట రికార్డును అధిగమించేందుకు కోహ్లీ చేరువలో ఉన్నాడు. ప్రస్తుతం విరాట్ ఫామ్ చూస్తే దక్షిణాఫ్రికాతో బుధవారం నుంచి ప్రారంభంకానున్న టెస్టు సిరీస్‌లోనే... ఈ రికార్డు బ్రేక్ అయ్యే అవకాశముంది. ఇందుకోసం విరాట్ 281 పరుగులు చేయాల్సి ఉంది. ఫలితంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 21 వేల పరుగుల మైలురాయి అందుకున్న తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు.
మాస్టర్, లారాతో పోటీ...
సచిన్ 473 ఇన్నింగ్స్‌ల్లో 21వేల పరుగులు చేయగా... వెస్టిండీస్ దిగ్గజం బ్రియన్ లారా 485 ఇన్నింగ్స్‌ల్లో సాధించాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ ఇప్పటికే అన్ని ఫార్మాట్లలో కలిపి 432 ఇన్నింగ్స్‌ల్లో 20వేల 719 రన్స్ చేశాడు.