తెలంగాణ

telangana

ETV Bharat / sports

కోహ్లీ రికార్డు 'డబుల్'... టీమిండియా 601/5 డిక్లేర్

పుణె టెస్టులో 601 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్​ను డిక్లేర్ చేసింది టీమిండియా. కోహ్లీ డబుల్ సెంచరీతో చెలరేగాడు.

కోహ్లీ

By

Published : Oct 11, 2019, 4:11 PM IST

Updated : Oct 11, 2019, 4:33 PM IST

పుణె వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న రెండో టెస్టులో టీమిండియా సారథి విరాట్​ కోహ్లీ రికార్డుల మోత మోగించాడు. భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన సారథిగా నిలిచాడు. ఫలితంగా టీమిండియా 601 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్​ను డిక్లేర్ చేసింది.

ఓవర్​నైట్ స్కోర్ 273 పరుగులతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు రహానే, కోహ్లీ నాలుగో వికెట్​కు మంచి భాగస్వామ్యాన్ని అందించారు. రహానే 59 పరుగులు చేసి ఔటయ్యాక జడేజాతో కలిసి మరో వికెట్ పడకుండా స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడువిరాట్​. ఈ క్రమంలో డబుల్ సెంచరీని సాధించాడు. 91 పరుగులు చేసిన జడేజా ముత్తుసామి బౌలింగ్​లో ఔట్ కాగా.. కోహ్లీ డిక్లేర్ ప్రకటించాడు. అప్పటికీ విరాట్ 254* పరుగులతో క్రీజులో ఉన్నాడు.

కోహ్లీ అదరహో...

ఈ మ్యాచ్​లో 254* పరుగులు చేసిన కోహ్లీ మరో రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన సారథిగా తన రికార్డును తానే బద్దలు కొట్టుకున్నాడు

భారత కెప్టెన్​లు అత్యధిక పరుగులు...

  • 254* (కోహ్లీ) vs దక్షిణాఫ్రికా (2019)
  • 243 (కోహ్లీ) vs శ్రీలంక (2017)-
  • 235 (కోహ్లీ) vs ఇంగ్లాండ్ (2016)
  • 224 (ధోనీ)vs ఆస్ట్రేలియా (2012)
Last Updated : Oct 11, 2019, 4:33 PM IST

ABOUT THE AUTHOR

...view details