వెస్టిండీస్‌పై రెండు టీ20ల్లోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా.. నామమాత్రపు మూడో మ్యాచ్ కోసం జట్టులో మార్పులు చేయనుంది. వెస్టిండీస్‌లోని గయానా వేదికగా జరిగే ఈ పోరులో కొత్త వాళ్లకు అవకాశమివ్వనున్నట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పాడు.
"చివరి మ్యాచ్ గెలవడమే మా మొదటి ప్రాధాన్యత. అలాగే యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించడమూ ముఖ్యం. తొలి రెండు టీ 20ల్లో ఆడని కొంతమందికి చివరి మ్యాచ్‌లో తీసుకునే ఆలోచనలో ఉన్నాం." -విరాట్ కోహ్లీ, టీమిండియా సారథి
వెస్టిండీస్ గయానాలో మ్యాచ్ జరగనున్నట్టు, ప్రస్తుతం అక్కడికి బయదేరనున్నామని తెలిపాడు కోహ్లీ.
"శ్రేయస్ అయ్యర్, రాహుల్ చాహర్‌ను ఆడించే ఆలోచనలో ఉన్నాం. దీపక్ చాహర్‌కు అవకాశం దక్కినా ఆశ్చర్యపోనక్కర్లేదు. యాజమాన్యం పంత్‌ను పక్కన పెట్టాలనుకుంటే అతడి స్థానంలో కేఎల్ రాహుల్ జట్టులోకి వస్తాడు." -విరాట్ కోహ్లీ, టీమిండియా సారథి