శనివారం బంగ్లాదేశ్తో టెస్టు మ్యాచ్ సందర్భంగా.. స్టేడియంలో పరుగెత్తుకొచ్చిన అభిమానిని పలకరించిన విరాట్.. మరోసారి తన ఆత్మీయతను చాటుకున్నాడు. జట్టుతో కలిసి మ్యాచ్ తర్వాత హోటెల్కు బయలుదేరిన కోహ్లీ.. స్టేడియం బయట తన కోసం ఎదురుచూస్తున్న దివ్యాంగురాలైన అభిమానితో ముచ్చటించాడు.
కోహ్లీ కోసం ఇండోర్ స్టేడియం బయట చాలా సేపటి నుంచి ఎదురు చూస్తున్న 'పూజా శర్మ' అనే అభిమానిని పలకరించి ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. విరాట్ ఆటను ఎంతో ఇష్టపడే ఆమె మొదటి సారి మ్యాచ్ను ప్రత్యక్షంగా తిలకించింది.