టెస్టు క్రికెట్ ర్యాంకింగ్స్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మంగళవారం విడుదల చేసింది. బ్యాటింగ్ ర్యాంకుల్లో.. టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. 886 పాయింట్లతో ఒక స్థానాన్ని మెరుగుపరచుకుని రెండో స్థానానికి చేరుకున్నాడు. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్.. 911 పాయింట్లతో తొలిస్థానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో ఛెతేశ్వర్ పుజారా ఏడోస్థానంలో ఉండగా.. అజింక్య రహానె 10వ స్థానానికి చేరుకున్నాడు.
బ్యాట్స్‌మెన్ జాబితాలో న్యూజిలాండ్‌కు చెందిన కేన్ విలియమ్సన్ మూడోస్థానానికి పడిపోయాడు. ఆ తర్వాత నాలుగో స్థానంలో మార్కస్ లబుషేన్, ఐదోస్థానంలో బాబర్ ఆజామ్, ఆరోస్థానంలో డేవిడ్ వార్నర్‌లు ఉన్నారు.
బౌలింగ్ ర్యాంకులు
బౌలింగ్ ర్యాంకుల్లో టీమ్ఇండియా ఆటగాళ్లు జస్ప్రీత్ బుమ్రా (779), రవిచంద్రన్ అశ్విన్ (756) ఒక్కో స్థానాన్ని మెరుగుపరుచుకుని 8, 10వ స్థానాల్లో ఉన్నారు. ఆస్ట్రేలియాకు చెందిన పాట్ కమిన్స్ (904) ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాత స్థానాల్లో ఇంగ్లాండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ (845), న్యూజిలాండ్‌కు చెందిన నీల్ వాగ్నర్(840)లు ఉన్నారు.
స్టోక్స్‌దే అగ్రస్థానం
ఆల్‌రౌండర్ జాబితాలో టీమ్ఇండియా ఆటగాళ్లైన రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌లు టాప్-10లో చోటు దక్కించుకున్నారు. జడేజా (397) మూడో స్థానంలో ఉండగా.. 281 పాయింట్లతో అశ్విన్ ఆరోస్థానానికి చేరుకున్నాడు. 446 పాయింట్లతో ఇంగ్లాండ్‌కు చెందిన బెన్‌స్టోక్స్ అగ్రస్థానంలో నిలిచాడు.