టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 242 ఇన్నింగ్స్‌ల్లో 12వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఆస్ట్రేలియాతో మూడో వన్డే సందర్భంగా ఈ మార్క్‌ను చేరుకున్నాడు.
సచిన్‌ను అధిగమించిన కోహ్లీ- వన్డేల్లో సరికొత్త రికార్డు
స్టార్ క్రికెటర్ కోహ్లీ.. వన్డేల్లో మరో ఘనత సాధించాడు. ప్రపంచంలోనే అందరికంటే వేగంగా 12వేల పరుగుల మార్క్‌ను అందుకున్నాడు.
సచిన్ అధిగమించిన కోహ్లీ.. వన్డేల్లో సరికొత్త రికార్డు
అతడి తర్వాతి స్థానాల్లో సచిన్ తెందుల్కర్(300 ఇన్నింగ్స్‌లు), పాంటింగ్(314), కుమార సంగక్కర(336), సనత్ జయసూర్య(379), మహేల జయవర్ధనే(399) ఉన్నారు.
మూడు వన్డేల సిరీస్‌ను ఇప్పటికే 2-0 తేడాతో ఆస్ట్రేలియా సొంతం చేసుకుంది. నామమాత్ర మూడో వన్డే కాన్బెర్రా వేదికగా జరుగుతోంది. అనంతరం మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆసీస్‌తో భారత జట్టు ఆడనుంది.
Last Updated : Dec 2, 2020, 10:36 AM IST