తెలంగాణ

telangana

ETV Bharat / sports

'వైస్​కెప్టెన్​గా ఎంపికవ్వడం గర్వకారణం'

టీమ్​ఇండియా వైస్​కెప్టెన్​గా ఎంపికవుతానని తాను ముందుగా ఊహించలేదని ఓపెనర్​​ కేఎల్​ రాహుల్​ తెలిపాడు. ఈ బాధ్యత తనకు గర్వకారణమని అభిప్రాయపడ్డాడు. దీన్ని సవాలుగా స్వీకరించి జట్టు కోసం తగిన కృషి చేస్తానని తెలిపాడు.

KL Rahul reacts to his India vice-captain role during Australia tour
వైస్​కెప్టెన్​గా ఎంపికవ్వడం గర్వకారణం: కేఎల్​ రాహుల్​

By

Published : Oct 29, 2020, 8:21 PM IST

ఆస్ట్రేలియా పర్యటనకు టీమ్​ఇండియా వైస్​కెప్టెన్​గా ఎంపికవ్వడంపై ఓపెనర్​ కేఎల్​ రాహుల్​ సంతోషాన్ని వ్యక్తం చేశాడు. జట్టులో తనకు దక్కిన కొత్త నాయకత్వ బాధ్యత తనకు గర్వకారణమని తెలిపాడు.

"ఇది గర్వించదగ్గ క్షణం. వైస్​కెప్టెన్​ అవుతానని నేను ఊహించలేదు. చాలా సంతోషంగా ఉంది. ఈ బాధ్యతను ఓ సవాలుగా స్వీకరిస్తాను. నా జట్టు కోసం తగిన కృషి చేస్తాను. ఆస్ట్రేలియా పర్యటన కోసం ఎంతో ఆసక్తిగా ఎదురూచూస్తున్నా. దాని కంటే ముందు 2-3 వారాలు చాలా ముఖ్యమైనవి. ఆ తర్వాతి 2-3 నెలలు కూడా ముఖ్యమైనవే. కానీ, ప్రస్తుతం అంతదూరం ఆలోచించకుండా నేను చేసే పనిమీద దృష్టి సారిస్తా."

-కేఎల్​ రాహుల్​

భారత జట్టుకు పరిమిత ఓవర్లలో వైస్​కెప్టెన్​గా వ్యవహరిస్తున్న రోహిత్​ శర్మ గాయం కారణంగా ఆస్ట్రేలియా పర్యటనకు దూరమయ్యాడు. ఫలితంగా ఆ బాధ్యతను సెలెక్టర్లు కేఎల్​ రాహుల్​కు అప్పగించారు. జాతీయ జట్టులోకి వచ్చిన తక్కువ సమయంలోనే వైస్​కెప్టెన్​గా కేఎల్​ రాహుల్​ ఎంపికవ్వడం విశేషం.

యూఏఈ వేదికగా జరుగుతున్న ప్రస్తుత ఐపీఎల్​ సీజన్​లో కేఎల్​ రాహుల్​ అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. తన బ్యాట్​తో పరుగుల వరద పారించి పర్పుల్​ క్యాప్​ రేసులో మొదటి నుంచి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మరోవైపు కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​ కెప్టెన్​గా లీగులో 5 పరాజయాల తర్వాత 5 వరుస విజయాలను నమోదు చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. టోర్నీలో పంజాబ్​ ఆడాల్సిన మరో రెండు మ్యాచ్​ల్లో విజయం సాధిస్తే ప్లేఆఫ్స్​కు వెళ్లే అవకాశాలు మరింత మెరుగువుతాయి.

ABOUT THE AUTHOR

...view details