బాలీవుడ్ నటి అథియా శెట్టి, టీమ్‌ఇండియా బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ మధ్య ఏదో ఉందనే అభిమానుల అనుమానం నిజమైనట్లే అనిపిస్తోంది. ఎందుకంటే రాహుల్ తమ బంధంపై బహిరంగంగానే ఒక క్లారిటీ ఇచ్చేశాడు. అథియా తన తల్లి మనా శెట్టి పుట్టిన రోజును పురస్కరించుకొని ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు పెట్టింది. అందులో తల్లీ కూతుళ్లిద్దరూ ఒకరినొకరు ఆప్యాయంగా హత్తుకొని సంతోషంగా ఉన్న ఫొటోను పంచుకుంది. 'ఐ లవ్యూ అమ్మా' అని క్యాప్షన్ ఇచ్చింది. ఇది చూసిన రాహుల్ కామెంట్ పెట్టాడు.
రాహుల్-అథియా ప్రేమాయణంపై క్లారిటీ!
టీమ్‌ఇండియా క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ నటి అథియా శెట్టి ప్రేమలో ఉన్నారంటూ కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. తాజాగా అథియా పెట్టిన పోస్టుకు రాహుల్ చేసిన కామెంట్ అందుకు బలం చేకురుస్తోంది.
రాహుల్.. తాను కూడా ప్రేమిస్తున్నట్లు అర్థం వచ్చేలా లవ్ సింబల్ ఎమోజీని పోస్టు చేశాడు. దీనిపై అభిమానుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. వందలాది లైకులు కొట్టడమే కాకుండా పలువురు కామెంట్లు కూడా చేశారు. అథియా తండ్రి సునీల్ శెట్టి కూడా అదే ఎమోజీతో కామెంట్ పెట్టాడు.
అయితే.. రాహుల్, అథియా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారని సోషల్‌మీడియాలో చాలా రోజులుగానే వార్తలు వస్తున్నాయి. అందుకు కారణం ఏప్రిల్‌లో అతడి పుట్టిన రోజున అథియా ఇన్‌స్టాలో ఒక పోస్టు చేసింది. రాహుల్‌తో కలిసి దిగిన ఫొటోను పంచుకొని 'మై పర్సన్' అనే క్యాప్షన్ ఇచ్చింది. అప్పటి నుంచీ వారి మధ్య అనుబంధం ఏర్పడిందని అభిమానులు అనుకుంటున్నారు.