బీసీసీఐ మాజీ సెలక్టర్ దేవాంగ్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌కు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ తొలిప్రాధాన్య ఓపెనర్లని పేర్కొన్నారు. టీ20 ప్రపంచకప్ దృష్ట్యా శిఖర్ ధావన్‌ను రిజర్వు ఓపెనర్‌గా ఎంపిక చేశారని అన్నారు. యువ క్రికెటర్ సూర్యకుమార్‌కు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని సూచించారు. ఇంగ్లాండ్‌తో పొట్టి క్రికెట్ సిరీస్‌కు ముందు ఆయన మాట్లాడారు.
"టీ20 ప్రపంచకప్ సమీపిస్తున్న వేళ కేఎల్ రాహుల్, రోహిత్‌శర్మ టీమ్‌ఇండియా తొలి ప్రాధాన్య ఓపెనర్లు. శిఖర్ ధావన్ రిజర్వు ఓపెనర్‌గా ఉంటాడు. తనవంతు వచ్చేదాకా అతడు ఎదురు చూడక తప్పదు. బహుశా వన్డేల్లో అతడికి చోటు దక్కొచ్చు. అదీ టీ20 ప్రపంచకప్‌నకు అదనపు సన్నద్ధతగా భావిస్తేనే."