తెలంగాణ

telangana

ETV Bharat / sports

లంకXకివీస్: ఆఖరి ఓవర్లో ఉత్కంఠ విజయం

పల్లెకెలే వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టీ 20లో న్యూజిలాండ్ గెలిచింది. 162 పరుగుల లక్ష్యాన్ని ఆరు వికెట్లు కోల్పోయి ఆఖరి ఓవర్లో ఛేదించింది. గ్రాండ్ హోమ్(59), టామ్ బ్రూస్(53) అర్ధశతకాలతో రాణించారు.

శ్రీలంక

By

Published : Sep 4, 2019, 9:31 AM IST

Updated : Sep 29, 2019, 9:28 AM IST

ఆఖరి ఓవర్లో ఉత్కంఠ విజయం

శ్రీలంకతో ఉత్కంఠగా సాగిన రెండో టీ20లో న్యూజిలాండ్ విజయం సాధించింది. చివరి ఓవర్​లో 7 పరుగులు చేయాల్సి ఉండగా.. తొలి రెండు బంతులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది కివీస్. ఇలాంటి తరుణంలో హసరంగా వేసిన మూడో బంతిని కివీస్ ఆటగాడు మిషెల్ సాంట్నర్ (10) గాల్లోకి లేపాడు. బౌండరీ లైన్​లో ఉన్న షెహాన్ జయసూర్య అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. కానీ సమన్వయలోపంతో మరో ఫీల్డర్ కుశాల్ మెండిస్​ను తగిలిన కారణంగా బంతి బౌండరీ లైన్ దాటింది. ఫలితంగా ఆరు పరుగులు వచ్చాయి. తర్వాతి బంతిని సాంట్నర్ ఫోర్ కొట్టి మ్యాచ్ ముగించాడు. 2 కీలక వికెట్లు తీసిన టిమ్​ సౌథీకి మ్యాన్ ఆఫ్​ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

162 పరుగుల లక్ష్యాన్ని రెండు బంతులు మిగిలుండగానే ఛేదించింది కివీస్​. కొలిన్ డి గ్రాండ్​హోమ్(59), టామ్​ బ్రూస్(53) అర్ధశతకాలతో ఆకట్టుకుని మ్యాచ్​ను గెలిపించారు. లంక బౌలర్లలో అకిలా ధనంజయ 3 వికెట్లు తీయగా.. ఇసురు ఉడానా, హసరంగా చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.

తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. డిక్​వెల్లా (39), అవిష్కా ఫెర్నాండో(39) నిలకడగా ఆడి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించారు. కివీస్ బౌలర్లలో సెత్​ ర్యాన్స్ 3 వికెట్లు తీయగా.. స్కాట్, సౌథీ చెరో రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.

ఇది చదవండి: 'కాంకషన్' సరైన విధానమే: విరాట్​ కోహ్లీ

Last Updated : Sep 29, 2019, 9:28 AM IST

ABOUT THE AUTHOR

...view details