మొహాలీ వేదికగా పంజాబ్, హైదరాబాద్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 4 వికెట్ల నష్టానికి 150 పరుగులు సాధించింది. ఇన్నింగ్స్ ప్రారంభంలోనే బెయిర్ స్టో (1) పెవిలియన్ బాట పట్టాడు. అనంతరం విజయ్ శంకర్‌తో కలిసి వార్నర్ నెమ్మదిగా ఆడుతూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డాడు. 26 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద విజయ్ శంకర్ ఔటయ్యాడు. వార్నర్ 62 బంతుల్లో 70 పరుగులు చేసి సన్ రైజర్స్ గౌరవప్రదమైన స్కోర్ చేయడంలో కీలకపాత్ర వహించాడు. దీంతో పంజాబ్ ముందు 151 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది భువీ సేన.
కింగ్స్ ఎలెవన్ లక్ష్యం 151 పరుగులు
కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్ రైజర్స్ 150 పరుగులు సాధించింది. వార్నర్ అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు.
ఐపీఎల్
పంజాబ్ బౌలర్లు ఆకట్టుకునే ప్రదర్శన చేశారు. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో సన్ రైజర్స్ బ్యాట్స్‌మెన్‌ని ఇబ్బందిపెట్టారు. పంజాబ్ బౌలర్లలో ముజిబ్ ఉర్ రెహమన్, షమి, అశ్విన్ తలో వికెట్ తీశారు.
Last Updated : Apr 9, 2019, 8:10 AM IST