తెలంగాణ

telangana

ETV Bharat / sports

హరియాణా స్పోర్ట్స్ వర్సిటీ ఛాన్సలర్​గా కపిల్​దేవ్​ - sports university

భారత క్రికెట్ దిగ్గజం కపిల్​దేవ్​ హరియాణా స్పోర్ట్ వర్సిటీ ఛాన్సలర్​గా నియమితులయ్యాడు. రాయ్​లోని సోనిపత్​​లో ఉన్న ఈ విశ్వవిద్యాలయానికి తొలి ఛాన్సలర్​ కపిలే కావడం గమనార్హం.

కపిల్ దేవ్

By

Published : Sep 14, 2019, 6:11 PM IST

Updated : Sep 30, 2019, 2:41 PM IST

భారత మాజీ ఆటగాడు కపిల్ దేవ్​ ఎవరకీ దక్కని గౌరవం అందుకున్నాడు. హరియాణాకు చెందిన ఈ దిగ్గజ క్రికెటర్​ ఆ రాష్ట్ర క్రీడా వర్సిటీకి మొదటి ఛాన్సలర్​గా నియమితులయ్యాడు. ఈ విషయాన్ని హరియాణా మంత్రి అనిల్ విజ్ శనివారం ప్రకటించారు.

"హరియాణా క్రీడా విశ్వవిద్యాలయానికి తొలి ఛాన్సలర్​గా కపిల్ దేవ్ నియమితులయ్యారు. రాష్ట్ర మంత్రి మండలి ఆమోదంతో ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించాం. ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్​ సైన్సెస్​కు సంబంధించిన ట్రైనింగ్ ప్రోగ్రామ్​లు నిర్వహించేందుకు ఈ వర్సిటీకి అధికారాలు ఉన్నాయి. -అనిల్ విజ్, హరియాణా రాష్ట్ర మంత్రి.

ఈ విశ్వవిద్యాలయం రాయ్​లోని సోనిపత్​​లో ఉంది. క్రీడలకు సంబంధించి స్పోర్ట్స్ టెక్నాలజీ, స్పోర్ట్స్ జర్నలిజం లాంటి కీలక విభాగాలన్నీ ఈ వర్సిటీలో ఉన్నాయి.

ఇవీ చూడండి.. హైదరాబాద్​కు కెప్టెన్​గా అంబటి రాయుడు

Last Updated : Sep 30, 2019, 2:41 PM IST

ABOUT THE AUTHOR

...view details