తెలంగాణ

telangana

ETV Bharat / sports

'వారిద్దరి తర్వాత కెప్టెన్సీ ధోనీకి కలిసొచ్చింది'

దిగ్గజ క్రికెటర్లు కపిల్​దేవ్​, గంగూలీల తర్వాత కెప్టెన్సీ అందుకోవడం ధోనీకి చాలా కలిసొచ్చిందని అభిప్రాయపడ్డాడు మాజీ క్రికెటర్​ మనీందర్​ సింగ్​. అయితే ప్రతిభను గుర్తించడంలో గంగూలీ ముందుంటాడని అన్నాడు.

Kapil Dev and MS Dhoni are on the same page in terms of captaincy: Maninder Singh
'వాళ్లు కెప్టెన్లుగా ఉండటం ధోనీకి కలిసొచ్చింది'

By

Published : Aug 9, 2020, 12:05 PM IST

టీమ్​ఇండియాలో ఉత్తమ కెప్టెన్​ ఎవరనే దానిపై ఎప్పటి నుంచో చర్చ జరుగుతూనే ఉంది. ఈ విషయమై ఇప్పటికీ చాలామంది మాజీలు తమ అభిప్రాయాల్ని వెల్లడించారు. ఈ అంశంపై ఇటీవలే మాట్లాడిన మాజీ క్రికెటర్​ మనీందర్​ సింగ్.​. ధోనీ కంటే ముందు కపిల్​దేవ్​, గంగూలీ కెప్టెన్సీ చేయడం అతడికి దొరికిన అదృష్టమని అన్నాడు.

"టీమ్​ఇండియా మాజీ కెప్టెన్లు కపిల్​దేవ్​,​ గంగూలీల తర్వాత సారథ్య బాధ్యతలు అందుకున్న ధోనీ ఎంతో అదృష్టవంతుడు. కపిల్​దేవ్​ 1983లో ప్రపంచకప్​ తెచ్చిపెట్టగా, విదేశాల్లో మన జట్టు ఆటతీరు మెరుగయ్యేందుకు దాదా ఎంతగానో కృషి చేశాడు. ఈ రెండు విషయాలు ధోనీ కెప్టెన్సీకి ఎంతగానో ఉపయోగపడ్డాయి. నాకు తెలిసి కపిల్​, ధోనీ ఒకేలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఒకవేళ కపిల్​దేవ్​ కంటే ముందు ఎవరైనా ప్రపంచకప్​ గెలిచి ఉంటే.. అతడు​ కూడా గొప్ప కెప్టెన్​ అయ్యేవాడు"

-మనీందర్ సింగ్​​, టీమ్​ఇండియా మాజీ క్రికెటర్

మరోవైపు సౌరభ్​ గంగూలీ గురించి తన అభిప్రాయాలను పంచుకున్నాడు మనీందర్​ సింగ్​. దాదా కెప్టెన్సీ అంటే తనకు చాలా ఇష్టమని.. ప్రతిభ​ను ఎంపిక చేయడంలో ముందుంటాడని చెప్పాడు. యువరాజ్​ సింగ్​, హర్భజన్​ సింగ్​ లాంటి ఆటగాళ్లను దాదా ఎంతగానో ప్రోత్సహించాడని వెల్లడించాడు.

ABOUT THE AUTHOR

...view details