తెలంగాణ

telangana

By

Published : Mar 2, 2020, 8:48 PM IST

Updated : Mar 3, 2020, 5:05 AM IST

ETV Bharat / sports

'టీమిండియాను ఓడించడం సంతృప్తినిచ్చింది'

భారత జట్టును టెస్ట్​ సిరీస్​లో ఓడించడం సంతోషంగా ఉందని వెల్లడించాడు కివీస్​ సారథి విలియమ్సన్​. ఈ సిరీస్​లో కైల్​ జేమిసన్​ మెరుగైన ఆట ప్రదర్శించాడని కొనియాడాడు.

kane Williamson
టీమిండియా ఓడిపోవడం నాకు సంతృప్తినిచ్చింది

ప్రపంచ అత్యుత్తమ క్రికెట్‌ జట్టు టీమిండియాను ఓడించడం సంతృప్తిగా ఉందని కివీస్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌ అన్నాడు. తొలి టెస్టులో పది వికెట్లు, రెండో టెస్టులో ఏడు వికెట్ల ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది భారత్. ఫలితంగా న్యూజిలాండ్‌ 2-0 తేడాతో సిరీస్‌ కైవసం చేసుకుంది. మ్యాచ్‌ అనంతరం కివీస్‌ సారథి విలియమ్సన్‌ మాట్లాడుతూ.. ఇదో అద్భుతమైన సిరీస్‌ అని, తమ ఆటగాళ్లు బాగా ఆడారని మెచ్చుకున్నాడు. ముఖ్యంగా జేమిసన్​పై ప్రశంసలు కురిపించాడు.

"రెండు టెస్టుల్లో జేమిసన్‌ 9 వికెట్లు తీయడమే కాకుండా 93 పరుగులు చేసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఉత్సాహవంతమైన నైపుణ్యం కలవాడు. అతడు బ్యాట్‌తో పాటు బంతితోనూ మంచి ప్రదర్శన చేశాడు. అతడు పొడుగ్గా ఉండటం వల్ల ఈ పిచ్‌లపై బౌన్స్‌ లభిస్తుంది. అది జట్టుకెంతో ఉపయోగం. రెండు మ్యాచ్‌ల్లో చివర్లో విలువైన పరుగులు చేసి బాగా రాణించాడు.

-విలియమ్సన్‌, కివీస్‌ సారథి.

రెండు టెస్టుల సిరీస్‌ను కైవసం చేసుకోవడం వల్ల న్యూజిలాండ్‌ ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో మూడో స్థానానికి చేరుకుంది. టీమిండియా, ఆస్ట్రేలియా తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి.

ఇదీ చూడండి : 'పంత్'​ను ఏమనకండి... ఇది సమష్టి వైఫల్యం : కోహ్లీ

Last Updated : Mar 3, 2020, 5:05 AM IST

ABOUT THE AUTHOR

...view details