ఐపీఎల్లో పాల్గొనేందుకు తమ ఆటగాళ్లు సిద్ధమవ్వామని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఇటీవలే సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. సెప్టెంబరులో జరగాల్సిన ఇంగ్లాండ్ పర్యటన తర్వాత ఐపీఎల్లో ఆడొచ్చని ఆ దేశ ఆటగాళ్లకు బోర్డు సూచించిదని సమాచారం. తాజాగా ఈ విషయంపై ఆస్ట్రేలియా కోచ్ జస్టిన్ లాంగర్ స్పష్టత ఇచ్చాడు.
"ఆసీస్ జట్టు కచ్చితంగా ఇంగ్లాండ్‌లో పర్యటించాలి. ఒకవేళ ఐపీఎల్ జరిగితే ఆసీస్ ఆటగాళ్లు ఆడేందుకు అనుమతిస్తాం. అంతర్జాతీయ క్రికెట్‌ను తిరిగి అభివృద్ధి చేయడానికైనా సెప్టెంబరులో ఇంగ్లాండ్ టూర్‌కు ఆస్ట్రేలియన్ క్రికెటర్లు వెళ్లాలి. మరోవైపు కొన్ని రోజులుగా ఐపీఎల్ నిర్వహణపై సందిగ్ధం నెలకొంది. పరిస్థితులను బట్టి టోర్నీ ప్రణాళిక మారుతూ వస్తోంది. ఏది ఏమైనా ఆస్ట్రేలియాతో టీమ్ఇండియా సిరీస్ ఆడాలని కోరుకుంటున్నా".