తెలంగాణ

telangana

ETV Bharat / sports

కివీస్​తో తొలి టెస్టు నుంచి హెజిల్​వుడ్​ ఔట్​ - josh hazlewood

ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ జోష్ హెజిల్​వుడ్ కాలి కండరాల గాయంతో కివీస్​తో జరుగుతున్న తొలి టెస్టు నుంచి తప్పుకున్నాడు. పెర్త్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది.

Josh Hazlewood to miss remainder of Pink ball Test vs New Zealand with hamstring injury
జోష్ హేజిల్​వుడ్​

By

Published : Dec 14, 2019, 12:20 PM IST

Updated : Dec 14, 2019, 3:59 PM IST

న్యూజిలాండ్​తో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియాకు షాక్ తగిలింది. పెర్త్ వేదికగా జరుగుతున్న మ్యచ్​లో కాలి కండరాల గాయంతో ఆ జట్టు స్టార్ బౌలర్ జోష్ హెజిల్​వుడ్ తొలి టెస్టుమొత్తానికి దూరమయ్యాడు.

ఇరు జట్ల మధ్య రెండో రోజు ఆట ప్రారంభమైన కాసేపటికే హెజిల్​వుడ్​కు కండరాలు పట్టేశాయి. ఫిజియో వచ్చి ప్రాథమిక చికిత్స అందించిన ఫలితం లేకపోయేసరికి ఈ నిర్ణయం తీసుకున్నారు. అప్పటికి అతడు 8 బంతులే బౌలింగ్ చేశాడు.

"కాలి కండరాల గాయంతో ఆస్ట్రేలియా బౌలర్ జోష్ హెజిల్​వుడ్ తొలి టెస్టుకు దూరమయ్యాడు. ఈ కారణంగా అతడు తొలి టెస్టు మొత్తానికీ దూరమయ్యాడు" -ఐసీసీ ట్వీట్

ఈ మ్యాచ్​లో మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్​ తొలి ఇన్నింగ్స్​లో 416 పరుగులు చేసింది. లబుషేన్(143) శతకం చేసి మరోసారి అదరగొట్టాడు. ప్రస్తుతం కివీస్ 8 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. స్టార్క్​ 5 వికెట్లు తీయగా హేజిల్​వుడ్ ఓ వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇదీ చదవండి: వైరల్​: 4.5 సెకండ్లలోనే బాస్కెట్లో బంతి..!

Last Updated : Dec 14, 2019, 3:59 PM IST

ABOUT THE AUTHOR

...view details