తెలంగాణ

telangana

By

Published : Mar 15, 2020, 6:52 PM IST

ETV Bharat / sports

జయదేవ్​ ఉనద్కత్​కు పార్ట్​నర్​ దొరికేసింది

దేశవాళీలో సౌరాష్ట్ర జట్టు కెప్టెన్ జయదేవ ఉనద్కత్​.. త్వరలో పెళ్లిపీటలెక్కనున్నాడు​. ఇటీవలె రంజీ ట్రోఫీ గెలిచిన ఆనందంలో ఉన్న ఇతడు.. తాజాగా నిశ్చితార్థం చేసుకున్నాడు. ఆదివారం ఈ వేడుకకు హాజరైన సహచరుడు చెతేశ్వర్​ పుజారా.. నూతన జంటకు సామాజిక మాధ్యమాల వేదికగా శుభాకాంక్షలు తెలిపాడు.

Jaydev Unadkat announces engagement, Pujara wished teammate "ready to deal with a lot of bromance"
జయదేవ్​ ఉనద్కత్​కు పార్ట్​నర్​ దొరికేసింది

జయదేవ్​ ఉనద్కత్​కు ఈ ఏడాది బాగా కలిసి వచ్చినట్టుంది. ఇటీవలె ఇతడి సారథ్యంలోని సౌరాష్ట్ర జట్టు తొలిసారి రంజీ ట్రోఫీ గెలవగా.. తాజాగా ఈ పేసర్​ పెళ్లికొడుకయ్యాడు. ఆదివారం కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో రిన్నీ అనే అమ్మాయితో నిశ్చితార్థం జరిగింది. తాజాగా అక్కడ తీసుకున్న ఫొటోను సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నాడు జయదేవ్​. ఈ క్రికెటర్​కు పలువురు ఆటగాళ్లు సామాజిక మాధ్యమం వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. వీరిద్దరూ ప్రేమించుకొని, పెద్దలను ఒప్పించినట్లు తెలుస్తోంది. ఈ వేడుకకు స్టార్​ క్రికెట్​ చెతేశ్వర్​ పుజారా హాజరయ్యాడు.

తాజాగా జరిగిన రంజీ టోర్నీలో ఈ 21 ఏళ్ల జయదేవ్​​.. ఒక సీజన్​లో ఎక్కువ వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. మెగాటోర్నీలో 13.23 సగటుతో 67 వికెట్లు తీశాడు. సౌరాష్ట్ర జట్టు మూడు సార్లు ఫైనల్​ చేరగా.. ఈ ఏడాది తొలి టైటిల్​ గెలిచింది. తుది పోరులో బెంగాల్​ జట్టుపై విజయం సాధించింది.

జయదేవ్‌ చివరిసారిగా 2018లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్​లో టీమిండియా తరఫున ఆడాడు. ప్రస్తుతం భారత జట్టులో పునరాగమనం కోసం ఇతడు ఎదురుచూస్తున్నాడు.

ABOUT THE AUTHOR

...view details