కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా పలు క్రీడాటోర్నీలు రద్దయ్యాయి. ఐపీఎల్ ఏప్రిల్ 15కు వాయిదా పడింది. ఈ వైరస్ నియంత్రణలో భాగంగా క్రికెటర్లందరూ ప్రస్తుతం ఇంటికే పరిమితమయ్యారు. అయితే ఈ ఖాళీ సమయంలో వారికి నచ్చిన వ్యాపకాలతో గడుపుతున్నారు. ప్రస్తుతం స్వీయనిర్బంధంలో ఉన్న టీమిండియా బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్, తనకు తెలిసిన మ్యాజిక్ ట్రిక్స్‌తో కాలక్షేపం చేస్తున్నాడు. సోదరితో కలిసి అతడు చేసిన కార్డ్షో వీడియోను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ట్వీట్ చేసింది.
మ్యాజిక్ ట్రిక్‌లతో కాలక్షేపం చేస్తున్న శ్రేయస్ అయ్యర్
స్వీయ నిర్బంధంలో ఉన్న టీమిండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్.. ప్లేయింగ్ కార్డ్స్‌తో మ్యాజిక్ ట్రిక్ చేసి అందరికీ వినోదాన్ని పంచుతున్నాడు. ఆ వీడియోను బీసీసీఐ ట్వీట్ చేసింది.
మ్యాజిక్ ట్రిక్‌లతో కాలక్షేపం చేస్తున్న శ్రేయస్ అయ్యర్
కరోనా నియంత్రణలో భాగంగా వీలైంనంత వరకు స్వీయనిర్బంధంలో ఉండాలని, అత్యవసరమయితే తప్ప బయటకు రావొద్దని కేంద్ర ప్రభుత్వం ప్రజలకు సూచించింది. ఈ వైరస్ వల్ల ఇప్పటికే 11,000 మంది మరణించగా.. 2,50,000 మంది దీని బారిన పడ్డారు.
ఇదీ చూడండి.. రిజర్వ్‌డే కోసం ఐసీసీకి క్రికెట్ ఆస్ట్రేలియా వినతి