తెలంగాణ

telangana

ETV Bharat / sports

'టీమిండియా అసలైన ఆటతీరు అప్పుడే చూశా'

న్యూజిలాండ్ పర్యటన​లో టీమిండియా ఆటతీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీ20 సిరీస్​కు పూర్తి భిన్నంగా వన్డే, టెస్టు సిరీస్​లో జట్టు ఓటమి చెందిందని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు బ్రాడ్​హగ్​ తెలిపాడు.

By

Published : Feb 25, 2020, 12:40 PM IST

Updated : Mar 2, 2020, 12:32 PM IST

Its-turning-into-sightseeing-tour-for-them--Brad-Hogg
'టీమిండియా అసలైన ఆటతీరు అప్పుడే చూశా'

న్యూజిలాండ్‌ చేతిలో తొలి టెస్టు ఓటమి కారణంగా టీమిండియాపై విమర్శలు వస్తున్నాయి. బ్యాటింగ్‌ లోపాలు కొంపముంచాయని విశ్లేషకులు అంటున్నారు. ఈ పర్యటనలో తొలి రెండు వారాలు అద్భుతమైన ప్రదర్శన చేసిన కోహ్లీసేనకు తర్వాత నాలుగు వారాలు యాత్రగా మారాయని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు బ్రాడ్‌హగ్‌ తీవ్రంగా విమర్శించాడు.

"న్యూజిలాండ్‌లో టెస్టు క్రికెట్‌ ఆడేందుకు టీమిండియా ఇంకా ఇబ్బందులు పడుతోంది. క్రైస్ట్‌చర్చ్‌ టెస్టులో సీమింగ్‌ బంతుల్ని ఎలా ఎదుర్కోవాలో ఓ దారి కనుగొనేందుకు ఆ జట్టు బ్యాట్స్‌మెన్‌కు ఇంకా ఐదు రోజుల సమయం ఉంది. తొలి రెండు వారాలు వారు అసలు సిసలైన క్రికెట్‌ ఆడారు. ఆ తర్వాత నాలుగు వారాలు వారికి విహార యాత్రగా మారాయి."

- బ్రాడ్​హగ్​, ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు

ఐదు టీ20ల సిరీస్‌లో కివీస్‌ను 5-0తో క్లీన్‌స్వీప్‌ చేసిన కోహ్లీసేన తర్వాత మూడు వన్డేల సిరీస్‌లో 0-3తో వైట్‌వాష్ అయింది. ఇప్పుడు తాజాగా తొలి టెస్టులో నాలుగు రోజుల్లోనే 10 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అగ్రస్థానంలో ఉన్న భారత్‌ ఇలా పరాభవం పొందడం చాలామందికి రుచించడం లేదు.

కివీస్‌తో తొలి టెస్టులో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 165 పరుగులే చేసింది. బదులుగా కివీస్‌ 348 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ కోహ్లీసేనకు బ్యాటింగ్‌ కష్టాలు ఎదురయ్యాయి. 191 పరుగులకే ఆలౌటైంది. ఛేదనకు దిగిన కివీస్‌ 9 పరుగులు చేసి 10 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది.

ఇదీ చూడండి.. ఈ పేర్లు ఎవరికైనా తెలుసా?.. ట్రంప్​పై ఐసీసీ ట్రోల్

Last Updated : Mar 2, 2020, 12:32 PM IST

ABOUT THE AUTHOR

...view details