తెలంగాణ

telangana

ETV Bharat / sports

రంజీలో ఆడనున్న టీమిండియా క్రికెటర్లు - Shikar Dhawan

టీమిండియా ఓపెనర్​ శిఖర్​ ధావన్​, బౌలర్ ఇషాంత్ శర్మ కొంత విరామం తర్వాత రంజీట్రోఫీ ద్వారా మళ్లీ మైదానంలో అడుగుపెట్టనున్నారు. ఇద్దరూ ఒకే జట్టుకి ప్రాతినిధ్యం వహించనున్నారు.

Ishant, Shikhar to play for Delhi against Hyderabad
ఇషాంత్ శర్మ - ధావన్

By

Published : Dec 24, 2019, 7:02 AM IST

గాయం కారణంగా జట్టుకు దూరమైన టీమిండియా ఓపెనర్​ శిఖర్​ ధావన్ మళ్లీ మైదానంలో అడుగుపెట్టనున్నాడు. రంజీ ట్రోఫీలో దిల్లీ తరఫున ప్రాతినిధ్యం వహించనున్నాడు. అతడితో పాటు బౌలర్​ ఇషాంత్​ శర్మ కూడా దిల్లీ తరఫునే ఆడనుండటం విశేషం. దిల్లీ జట్టు డిసెంబరు 25న హైదరాబాద్​తో తలపడనుంది.

కొంత విరామం తర్వాత బరిలోకి..

కొంతకాలంగా బీసీసీఐ నిర్వహణ పనిభారం వల్ల ఆటకు దూరంగా ఉన్న ఇషాంత్​.. రంజీట్రోఫీ ద్వారా మళ్లీ మైదానంలోకి రానున్నాడు. హైదరాబాద్​తో జరగనున్న మ్యాచ్​లో ఆడనున్నాడు. ఇప్పటికే వచ్చే ఏడాది న్యూజిలాండ్​పై జరిగే టెస్ట్​ సిరీస్​లో జట్టులో చోటు సంపాదించాడు. ఇషాంత్ చివరగా బంగ్లాతో జరిగిన పింక్ టెస్టులో ఆడాడు.

మోకాలు గాయం కారణంగా విశ్రాంతి తీసుకున్న ధావన్​.. గాయం నుంచి కోలుకున్నట్లు జాతీయ క్రికెట్​ అకాడమి స్పష్టతనిచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే శ్రీలంక, ఆస్ట్రేలియాతో సిరీస్​ల్లో చోటు దక్కించుకున్న ధావన్.. తాజాగా రంజీ మ్యాచ్​లోనూ ఆడనున్నాడు. ఈ విషయాన్ని టీమిండియా ఛీఫ్​ సెలెక్టర్​ ప్రసాద్​ తెలియజేశాడు.

ఇదీ చదవండి: ప్రపంచకప్ ఓటమి మినహా అంతా ఓకే: రోహిత్​

ABOUT THE AUTHOR

...view details