ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్కు ముందు టీమ్ఇండియాకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ సిరీస్ కోసం ఎంపికైన బౌలర్ ఇషాంత్ శర్మ గాయం కారణంగా పూర్తిగా వైదొలగుతున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.
పక్కటెముకల గాయం కారణంగా ఐపీఎల్ మధ్యలోనే ఇషాంత్ శర్మ నిష్క్రమించాడు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ కోసం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసంలో ఉంటూ సాధన చేస్తున్నాడు. ఇషాంత్ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నా.. ఫిట్నెస్ పట్టు సాధించకపోవడం వల్ల అతడిని టెస్టు సిరీస్ కోసం తీసుకోవట్లేదని తెలుస్తోంది.