తెలంగాణ

telangana

By

Published : Feb 8, 2021, 3:32 PM IST

ETV Bharat / sports

కపిల్​ సరసన ఇషాంత్​.. 114 ఏళ్ల రికార్డ్​ అశ్విన్​ బ్రేక్​

ఇంగ్లాండ్​తో జరుగుతోన్న తొలి టెస్టులో టీమ్​ఇండియా బౌలర్లు ఇషాంత్​ శర్మ, రవిచంద్రన్​ అశ్విన్​ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. టెస్టు క్రికెట్​లో 300 వికెట్ల మైలురాయిని అందుకున్న ఆరవ భారత బౌలర్, మూడో భారత ఫాస్ట్​ బౌలర్​గా ఇషాంత్​ ఘనత సాధించాడు. ఇన్నింగ్స్​ తొలి బంతికే వికెట్​ తీసి రవిచంద్రన్​ అశ్విన్​ 114 ఏళ్ల రికార్డును బ్రేక్​ చేశాడు.

ishanth
ఇషాంత్​

టెస్టు క్రికెట్‌లో 300 వికెట్ల మైలురాయి చేరుకున్న ఆరవ భారత బౌలర్‌గా, మూడో భారత పేసర్‌గా వెటరన్‌ పేసర్‌ ఇషాంత్‌ శర్మ అరుదైన ఘనత సాధించాడు. కపిల్‌ దేవ్‌, అనిల్‌ కుంబ్లే వంటి దిగ్గజాలు ఉన్న జాబితాలో చోటు దక్కించుకున్నాడు.

చెన్నై టెస్టు నాలుగో రోజు ఆటలో ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ డాన్‌ లారెన్స్‌ను ఔట్​ చేయడం ద్వారా ఇషాంత్‌ ఈ ఫీట్​ను అందుకున్నాడు. 98 టెస్టుల్లో ఇషాంత్‌.. 300 వికెట్ల మైలురాయి చేరుకున్నాడు. కుంబ్లే, కపిల్‌దేవ్‌, అశ్విన్‌, హర్భజన్‌ సింగ్‌, జహీర్‌ ఖాన్‌ ఇప్పటికే ఈ జాబితాలో ఉన్నారు. 2007లో టెస్టుల్లో ఇషాంత్‌ అరంగేట్రం చేశాడు

114 ఏళ్ల రికార్డు

ఈ మ్యాచులో టీమ్​ఇండియా స్పిన్నర్​ రవిచంద్రన్​ అశ్విన్​ 114 ఏళ్ల రికార్డును బ్రేక్​ చేశాడు. ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్​ తీసిన తొలి స్నిన్నర్​గా ఘనతను అందుకున్నాడు. ఇంగ్లాండ్​ ఆటగాడు రోరీ బర్న్స్​ను(0) ఔట్​ చేసి ఈ ఫీట్​ను అందుకున్నాడు. అంతకముందు 1907లో దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్​ బెర్ట్​ వోగ్లర్​.. ఇంగ్లాండ్​పై ఈ రికార్డును సాధించాడు.

ఇదీ చూడండి: రెండో ఇన్నింగ్స్​: 6 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్

ABOUT THE AUTHOR

...view details