తెలంగాణ

telangana

By

Published : Nov 15, 2020, 12:05 PM IST

ETV Bharat / sports

'ఇషాన్​కు టీమ్​ఇండియాలో స్థానం పక్కా'

ముంబయి ఇండియన్స్​ యువ క్రికెటర్​ ఇషాన్​ కిషన్​.. త్వరలోనే జాతీయ జట్టులో చోటు దక్కించుకుంటాడని జోస్యం చెప్పారు టీమ్​ఇండియా మాజీ చీఫ్​ సెలక్టర్​ ఎమ్​ఎస్​కే ప్రసాద్. ఈ ఐపీఎల్​లో​ అతడి ప్రదర్శన ఆకట్టుకుందని అన్నారు.

Ishan Kishan
ఇషాన్

ఈ ఐపీఎల్​లో అద్భుత ప్రదర్శన చేసిన ముంబయి ఇండియన్స్​ యువ హిట్టర్​ ఇషాన్​ కిషన్​పై ప్రశంసలు కురిపించారు టీమ్​ఇండియా మాజీ చీఫ్​ సెలక్టర్​ ఎమ్​ఎస్​కే ప్రసాద్​. ఇదే ఫామ్​ను కొనసాగిస్తే త్వరలోనే జాతీయ జట్టులోకి అరంగేట్రం చేస్తాడని జోస్యం చెప్పారు.

"ఐపీఎల్ 2020లో ఇషాన్ కిషన్‌ అద్భుతంగా రాణించాడు. ముంబయి జట్టులో అతడు నెం.4లో నిలకడ ప్రదర్శన చేశాడు. కొన్ని మ్యాచ్‌ల్లో ఓపెనర్‌గానూ చక్కటి ప్రదర్శన కనబర్చాడు. మొత్తంగా మ్యాచ్‌ గమనానికి అనుగుణంగా గేర్లు మార్చడంలోనూ తనకి తిరుగులేదని నిరూపించుకున్నాడు. అందుకే ఇప్పుడు టీమ్​ఇండియా వన్డే, టీ20 వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ స్థానానికి పోటీదారుడిగా నిలిచాడు. వికెట్ కీపింగ్‌లోనూ అతడు సత్తాచాటగలిగితే తప్పకుండా టీమ్​ఇండియాకు ఆడతాడు".

-ఎమ్​ఎస్​కే ప్రసాద్, టీమ్​ఇండియా మాజీ చీఫ్​ సెలక్టర్.

ఈ ఐపీఎల్​లో 14 మ్యాచ్‌లాడిన ఇషాన్.. 145.76 స్ట్రైక్‌రేట్‌‌తో 516 పరుగులు చేశాడు. ఇందులో 30 సిక్సర్లు ఉన్నాయి. సీజన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మన్​గా ఇషాన్​ ఘనత సాధించాడు. అలానే అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌ల జాబితాలోనూ అతడు ఐదో స్థానంలో నిలిచాడు.

ఇదీ చూడండి : 'మరో దారి లేదు.. ట్రేడింగ్​ ద్వారానే తీసుకుంటాం'

ABOUT THE AUTHOR

...view details