ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిర్వహణపై పాలక మండలి ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ కీలక ప్రకటన చేశారు. మరో వారం- పది రోజుల్లో లీగ్ షెడ్యూల్‌పై చర్చించేందుకు సమావేశం జరగనున్నట్లు స్పష్టం చేశారు. ఐపీఎల్ ముందుకు సాగేలా బీసీసీఐ.. ప్రభుత్వ అనుమతి కోరుతుందని పేర్కొన్నారు.
"సెప్టెంబరు వరకు కరోనాతో నెలకొన్న పరిస్థితులను పరిశీలిస్తూనే ఉంటాం. ఆ తర్వాతే టోర్నమెంటును భారత్‌లో జరపాలా, యూఏఈలో నిర్వహించాలా అని నిర్ణయిస్తాం. ఇందుకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి."