రెండు రోజుల్లో ఐపీఎల్ 12వ సీజన్ మొదలవనుంది. ఒకవైపు వేసని తాపానికి రోజంతా డీలా పడిన సమయంలో పొట్టి క్రికెట్‌తో కాస్తంత ఊరట లభించనుంది. రోహిత్ మెరుపులు, కోహ్లీ అరుపులు, ధోని వ్యూహాలతో మైదానాలు సందడిగా మారనున్నాయి. ఇప్పటివరకు జరిగిన ప్రీమియర్ లీగ్‌లన్నింటిలో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్మన్లపై ఓ సారి లుక్కేద్దాం.
సురేష్ రైనా
ఒకప్పుడు టీమిండియా మిడిల్ ఆర్డర్లో ధనాధన్ బ్యాటింగ్‌తో అదరగొట్టాడు రైనా. ప్రస్తుతం ఫామ్ కోల్పోయాడు. తిరిగి తుది జట్టులో స్థానం కోసం ఆశగా ఎదురుచూస్తున్నాడు. ప్రతి ఐపీఎల్‌లోనూ అద్భుత ప్రదర్శన చేసే ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ మొత్తం ఐపీఎల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లలో మొదటి స్థానంలో ఉన్నాడు. 176 మ్యాచ్‌లు ఆడి 172 ఇన్నింగ్స్‌ల్లో 34.37 సగటుతో 4,985 పరుగులు చేశాడు. ఐదు వేల పరుగులు సాధించిన మొదటి క్రికెటర్‌గా నిలవడానికి ఇంకా 15 పరుగుల దూరంలో ఉన్నాడీ చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు.
విరాట్ కోహ్లీ
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు సారథ్యం వహిస్తోన్న కోహ్లీ.. జట్టుకు కప్పు తీసుకురావడంలో మాత్రం విఫలమవుతున్నాడు. బ్యాట్స్‌మెన్‌గా అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నా ఛాలెంజర్స్‌ను విజయతీరాలకు చేర్చలేకపోతున్నాడు. ఐపీఎల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్న కోహ్లీ మొదటి స్థానంలో ఉన్న రైనాకు గట్టి పోటీ ఇస్తున్నాడు. ఇప్పటివరకు 163 మ్యాచ్‌లు ఆడి 155 ఇన్నింగ్స్‌ల్లో 38.35 సగటుతో 4,948 పరుగులు సాధించాడు విరాట్.