ఐపీఎల్‌కు ఇంకా 25 రోజులు మాత్రమే ఉంది. ఇప్పటికే లీగ్ జరుగబోతున్న యూఏఈకి జట్లన్నీ చేరుకున్నాయి. హోటళ్లలో బస కూడా ఏర్పాటైంది. సాధారణంగా ఆటగాళ్ల వసతి గురించి ఎవరికీ పెద్దగా ఆసక్తి ఉండదు. కానీ ఈసారి లీగ్ పూర్తిగా యూఏఈలోనే నిర్వహించనున్నారు. రెండు నెలలకు పైగా ఆటగాళ్లు ఆ దేశంలోనే ఉండనున్నారు.
కరోనా ముప్పు నేపథ్యంలో వారంతా బయో'బుడగ'కు పరిమితం కానున్నారు. మరి సుదీర్ఘ సమయం హోటళ్లకు పరిమితం కానున్న వారికి.. ఎలాంటి వసతి ఏర్పాటు చేశారు.? ఏ జట్టు ఆటగాళ్లు ఎక్కడ ఉండబోతున్నారు..? వంటి విశేషాలను తెలుసుకుందాం రండి.
ముంబయి ఇండియన్స్
రోహిత్ శర్మ నేతృత్వంలోని డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబయి ఇండియన్స్ జట్టు.. అబుదాబిలోని 'సెయింట్ రేజిస్ సాదియత్' ఐలాండ్ రిసార్ట్‌లో బస చేస్తోంది. ఈ హోటల్‌కు అనుసంధానంగా బీచ్కుడా ఉంది. దుబాయ్‌లోని అతిపెద్ద రిసార్ట్‌ల్లో ఇదీ ఒకటి. ముంబయి జట్టు స్పాన్సర్లలో ఒకటైన మారియట్ గ్రూప్‌కు చెందినదే ఈ రిసార్ట్ కావడం విశేషం.
కోల్‌కతా నైట్‌రైడర్స్
కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు దుబాయ్‌లోని 'ది రిట్జ్ కార్టన్' హోటల్లో వసతి కల్పించారు. 'గ్రాండ్ కెనాల్' అని కూడా పిలిచే ఈ హోటల్‌ను 57 ఏకరాల విస్తీర్ణంలో నిర్మించారు. భారీ ఉద్యానవనం, ఈతకొలను, ప్రైవేటు బీచ్ ఉన్న రిసార్ట్ ఇది. నైట్‌రైడర్స్ యజమాని షారుఖ్ ఖాన్‌కు ఈ హోటల్‌తో అనుబంధం ఉంది. రిసార్ట్‌లో సగం గదులను జట్టు కోసం బుక్ చేసినట్లు సమాచారం.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
విరాట్ కోహ్లీ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. పామ్ జుమేరా ప్రాంతంలోని వాల్డర్ఫ్ అస్టోరియా హోటల్లో బస చేస్తోంది. దుబాయ్‌లో అత్యంత ఖరీదైన హోటల్లో ఇదొకటి. ఇందులోని గదుల నుంచి సముద్రం కనిపిస్తుంది. ప్రైవేటు బీచ్ అందుబాటులో ఉన్న ఈ రిసార్ట్‌లో ఆరు భారీ రెస్టారెంట్లు, లాంజ్‌లు ఉన్నాయి.
చెన్నై సూపర్‌కింగ్స్