ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో చైనా స్పాన్సర్షిప్లకు ముంగిపు పలకాలని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ యజమాని నెస్వాడియా పిలుపునిచ్చారు. ఇరు దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నెలకొన్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
"దేశం కోసం మనం ఈ పని చేయాలి. ఎప్పుడైనా దేశం ముందు.. తర్వాతే డబ్బు. అంతే కాకుండా ఇది ఇండియన్ ప్రీమియర్ లీగ్, చైనా ప్రీమియర్ లీగ్ కాదు. మొదట్లో స్పాన్సర్లను కనుగొనడం కష్టమే. కానీ మన దేశంలోనే కావాల్సినంత మంది స్పాన్సర్లు ఉన్నారని నేను కచ్చితంగా చెప్పగలను. మన దేశం ప్రభుత్వం పట్ల గౌరవంగా వ్యవహించాలి. మనకోసం తమ ప్రాణాలను పనంగా పెట్టిన సైనికులకు మనం అర్పించే నివాళి అదే."
-నెస్వాడియా, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ యజమాని
నెస్వాడియా తన అభిప్రాయాలను వెల్లడించిన అనంతరం.. చెన్నైసూపర్కింగ్స్ సహా ఇతర జట్లు స్పందిస్తూ.. ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా తాము మద్దతుగా ఉంటామని స్పష్టం చేశారు.