రానున్న ఐపీఎల్ సీజన్లో రెండు కొత్త జట్లను చేర్చేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో మొదటి ఫ్రాంచైజీగా అహ్మదాబాద్ సన్నద్ధమవుతుండగా రెండో జట్టు రేసులో కాన్పూర్, లఖ్నవూ సిటీలు ఉన్నాయి. అయితే ఈ జట్ల చేరిక విషయం మాత్రం బీసీసీఐ అధికారికంగా ప్రకటించలేదు.
ఒకవేళ ఈ అంశంపై భారత క్రికెట్ బోర్డు తుది నిర్ణయం తీసుకుంటే.. ఐపీఎల్14వ సీజన్లో పాల్గొనేందుకు అహ్మదాబాద్ ఫ్రాంచైజీ సిద్ధంగా ఉందని ఇన్సైడ్ స్పోర్ట్ నివేదిక పేర్కొంది. మరో 3-4 వారాల్లో బీసీసీఐ తుది నిర్ణయం ప్రకటించనున్నట్లు తెలిపింది.