తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్ ప్లే ఆఫ్స్ సమయాల్లో మార్పు - play offs

ఐపీఎల్ ప్లేఆఫ్​ మ్యాచ్​లు ముందు నిర్ణయించిన సమయం కంటే అరగంట ముందుగా ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.

ఐపీఎల్

By

Published : Apr 28, 2019, 9:34 AM IST

జోరుగా సాగుతున్న ఐపీఎల్ మ్యాచ్​లు ప్లే ఆఫ్స్ దశకు చేరుకుంటున్నాయి. మే 7 నుంచి ప్రారంభంకానున్న ఈ మ్యాచ్​ల సమయాన్ని అరగంట ముందుకు జరపాలని బీసీసీఐ నిర్ణయించింది.

లీగ్ దశలో 8 గంటలకు ప్రారంభమవుతున్న మ్యాచ్‌లు అర్ధరాత్రి వరకు సాగుతున్నందున ప్రేక్షకుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. పాలకమండలి (సీఓఏ)తోశనివారం బోర్డు చర్చించింది. బోర్డు విన్నపానికి సీవోఏ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

మే 7న చెన్నైలో తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్ జరుగనుండగా, 8, 10వ తేదీల్లో ఎలిమినేటర్‌, క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌లు విశాఖపట్టణంలో జరుగుతాయి. మే 12న జరిగే ఫైనల్‌కు హైదరాబాద్‌ ఆతిథ్యమివ్వనుంది.

ఇవీ చూడండి.. పపువా న్యూగినియాకు వన్డే హోదా​

ABOUT THE AUTHOR

...view details