ప్రపంచ క్రికెట్ లీగ్‌ల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎంతో పేరుగాంచింది. ఎంతోమంది విదేశీ ఆటగాళ్లు ఈ టోర్నీలో ఆడేందుకు ఆసక్తి చూపుతారు. ఆటగాళ్లను ఇంతగా ఆకర్షిస్తోన్న ఐపీఎల్.. క్రికెటర్లు ఆటను మెరుగుపర్చుకునేందుకు ఉపయోగపడుతుందని అంటున్నాడు న్యూజిలాండ్ క్రికెటర్ రాస్ టేలర్.
"ఐపీఎల్లో ఆడటాన్ని అదృష్టంగా భావిస్తున్నా. గొప్ప గొప్ప ఆటగాళ్లతో కలిసి ఆడేందుకు వీలు కలిగింది. ఈ టోర్నీ న్యూజిలాండ్ క్రికెట్‌కు ఎంతగానో ఉపయోగపడింది. వివిధ దేశాల ఆటగాళ్ల ఆటను దగ్గరగా చూసే వీలు కలిగి వారి ఆటతీరును అంచనా వేసేందుకు వీలైంది".
-రాస్ టేలర్, కివీస్ ఆటగాడు