ఐపీఎల్-2019 సీజన్ పూర్తి షెడ్యూల్ వచ్చేసింది. మార్చి 23న చెన్నై చెపాక్‌లో తొలి మ్యాచ్ ప్రారంభం కానుండగా, మే5న ముంబయి, కోల్‌కతా చివరి మ్యాచ్‌తో లీగ్ దశ ముగియనుంది. ఈ మ్యాచ్ ముంబయి వేదికగా జరగనుంది. మంగళవారం నాడు బీసీసీఐ అధికారికంగా ఈ షెడ్యూల్‌ను విడుదల చేసింది. ప్లే ఆఫ్, ఫైనల్ మ్యాచ్‌ల వివరాలు త్వరలో ప్రకటించనుంది బీసీసీఐ.
ఎన్నికల తేదీల్లోనూ ఐపీఎల్ - complete
ఐపీఎల్ పూర్తి షెడ్యూల్‌ని విడుదల చేసింది బీసీసీఐ. ఎన్నికలు దృష్టిలో ఉంచుకుని మొదటి రెండు వారాల ఐపీఎల్ షెడ్యూల్‌ని ఇప్పటికే ప్రకటించింది. మిగతా మ్యాచ్‌ల వివరాలను మంగళవారం విడుదల చేసింది
ఐపీఎల్ షెడ్యూల్
సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మొదటి రెండు వారాల(ఏప్రిల్ 5వరకు) ఐపీఎల్ షెడ్యూల్‌ను ఇప్పటికే విడుదల చేశారు. అన్ని మ్యాచ్‌లు భారత్‌లోనే నిర్వహించనున్నట్లు జనవరిలోనే బీసీసీఐ ప్రకటించింది. తొలి మ్యాచ్ చెన్నై, బెంగళూరు మధ్య జరుగుతుంది.
Last Updated : Mar 19, 2019, 9:01 PM IST