ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ ఐపీఎల్ వేలంలో సంచలనం సృష్టించాడు. రూ.2 కోట్ల కనీస ధరతో వేలంలో పాల్గొన్న ఈ ఆటగాడు ఏకంగా రూ.15.50 కోట్లు పలికాడు. బెంగళూరు, కోల్‌కతా, దిల్లీ అతడి కోసం పోటీపడగా చివరికి కోల్‌కతాకు దక్కాడు. ఈ ఏడాది టెస్టుల్లో 50కిపైగా వికెట్లు తీసి సత్తాచాటాడు. చివరి ఐదు టీ20ల్లో 1/19, 0/15, 2/23, 2/29, 2/27 తో ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు.
ఐపీఎల్ 2020: ఖరీదైన విదేశీ ఆటగాడిగా కమిన్స్ రికార్డు - ipl 2020 auction
ఐపీఎల్ వేలంలో ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ రికార్డు ధర పలికాడు. ఈ లీగ్లో ఖరీదైన విదేశీ ఆటగాడిగా ఘనత సాధించాడు. కనీస ధర రూ.2 కోట్లతో వేలంపాటలో పాల్గొన్న ఇతడిని.. రూ. 15.50 కోట్లకు సొంతం చేసుకుంది కోల్‌కతా నైట్రైడర్స్.
ఐపీఎల్ 2020: ఖరీదైన విదేశీ ఆటగాడు కమిన్స్
యువీ తర్వాత కమిన్స్...
ఇప్పటివరకు జరిగిన అన్ని సీజన్ల వేలంలో యువరాజ్ సింగ్ రూ.16 కోట్లతో ముందున్నాడు. 2015లో దిల్లీ అతడిని భారీ ధరకు దక్కించుకుంది. అతడి తర్వాత స్థానంలో కమిన్స్ (కోల్‌కతా) రూ.15.50 కోట్లతో నిలిచాడు. ఇతడిని 2017లో రైజింగ్ పుణె రూ.14.50 కోట్లకు సొంతం చేసుకుంది.