తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్​: స్వదేశీ ఆటగాళ్లపైనే రాజస్థాన్ రాయల్స్ దృష్టంతా - ipl 2019 rajasthan royals news

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్​) 2020 సీజన్‌కు అన్ని ఫ్రాంచైజీలు సిద్ధమయ్యాయి. కోల్​కతా వేదికగా గురవారం వేలం జరగనుంది. ఇప్పటికే ట్రేడింగ్‌ విండో ద్వారా ఒక ప్రధాన ఆటగాడిని వదిలేసిన రాజస్థాన్​... ఉన్న నిధులతో యువ ప్రతిభావంతులను ఎంపిక చేసుకోవాలని చూస్తోంది.

IPL Auction 2020
ఐపీఎల్​ వేలం: స్వదేశీ యువ ఆటగాళ్లపైనే రాజస్థాన్ రాయల్స్ దృష్టంతా!

By

Published : Dec 19, 2019, 5:45 AM IST

Updated : Dec 19, 2019, 9:35 AM IST

కోల్​కతా వేదికగా గురువారం జరిగే ఐపీఎల్​ వేలంలో రాజస్థాన్​ రాయల్స్ .. దేశవాళీల్లో ప్రతిభ చూపిన యువ క్రికెటర్లపై దృష్టిసారించనుంది. స్వదేశీ బ్యాట్స్​మెన్​, విదేశీ బౌలర్లనూ సొంతం చేసుకొనే ఆలోచనలో ఉంది.

అంటిపెట్టుకున్న ఆటగాళ్లు

స్టీవ్ స్మిత్(కెప్టెన్), సంజూ శాంసన్, జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్, జాస్ బట్లర్, రియాన్ పరాగ్, శశాంక్ సింగ్, శ్రేయస్ గోపాల్, మహిపాల్ లోమ్రార్, వరుణ్ ఆరోన్, మనన్ వోహ్ర,

  • ట్రేడెడ్ ఇన్: మయాంక్ మార్కండే(దిల్లీ నుంచి), అంకిత్ రాజ్​పుత్(పంజాబ్ నుంచి)

వదులుకున్న క్రికెటర్లు: ఆస్టన్ టర్నర్, ఒషానో థామస్, శుభమ్ రంజానే, ప్రశాంత్ చోప్రా, ఇష్ సోది, ఆర్యమన్ బిర్లా, జయదేవ్ ఉనద్కత్,క రాహుల్ త్రిపాఠి, స్టువర్ట్ బిన్నీ, లివింగ్​స్టన్, సుదేశన్ మిధున్

  • ట్రేడెడ్ ఔట్: అజింక్య రహానే(దిల్లీకి), క్రిష్ణప్ప గౌతమ్(పంజాబ్​కు)

ఉన్న నగదు: రూ.28.90 కోట్లు

మిగిలున్న స్థానాలు: 11(స్వదేశీ 7, విదేశీ 4)

వ్యూహం

రాజస్థాన్ రాయల్స్​కు ఇప్పటికే విదేశీ మ్యాచ్​ విన్నర్లు ఉన్నారు. అయితే ప్రస్తుతం వదులుకున్న రహానే, ఉనద్కత్, గౌతమ్ స్థానాల్ని భర్తీ చేసే క్రికెటర్ల కోసం ఈ వేలంలో పాల్గొనుంది.

అదే విధంగా భారత బ్యాట్స్​మన్, పేసర్​ను కొనుగోలు చేయాలని భావిస్తోంది. ఓవర్సీస్​ ఆటగాళ్ల బ్యాకప్​ కోసం కొత్త వారిని తీసుకొనే ఆలోచనలో ఉంది.

దృష్టి సారించే ఆటగాళ్లు

సిమన్స్, హెట్మయిర్, టామ్ బాంటన్, ఎవాన్స్, జేమ్స్ నీషమ్, యూసఫ్ పఠాన్, మనోజ్ తివారి, హనుమ విహారి, దీపక్ హుడా, క్రిస్ జోర్డాన్, సామ్ కరన్, మోహిత్ శర్మ, లుక్​మన్ మెరియవాలా, విరాట్ సింగ్, మార్కస్ స్టొయినిస్, క్రిస్ మోరిస్

Last Updated : Dec 19, 2019, 9:35 AM IST

ABOUT THE AUTHOR

...view details