తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్​ వేలం 2020: క్రిస్​లిన్​ ముంబయికి - ipl auction 2020 live

ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్​ క్రిస్​లిన్​.. ఐపీఎల్​-2020లో ముంబయి తరఫున ఆడనున్నాడు. కనీస ధర 2 కోట్లకు అతడిని దక్కించుకుంది ముంబయి.

ipl auction 2020
ఐపీఎల్​ వేలం 2020: హిట్టర్​ క్రిస్​లిన్​ను దక్కించుకున్న ముంబయి

By

Published : Dec 19, 2019, 4:47 PM IST

ఐపీఎల్​ ట్రేడింగ్​ విండోలో కోల్​కతా నైట్​రైడర్స్​ వదులుకోవడం వల్ల వేలంలోకి వచ్చాడు క్రిస్​లిన్​. ఇటీవల టీ10 లీగ్​లో విధ్వంసకర ప్రదర్శన చేసిన లిన్​ను.. ఈ సారి ముంబయి ఇండియన్స్ దక్కించుకుంది. ఐపీఎల్​ 2020 వేలంలో అమ్ముడుపోయిన తొలి ఆటగాడిగా నిలిచాడు లిన్. ముంబయి జట్టు అతడిని కనీస ధర రూ.2 కోట్లకే కొనుగోలు చేసింది.

క్రిస్​లిన్​

గతంలో​....

2018 వేలంలో క్రిస్​లిన్​ను కోల్‌కతా రూ.9.50 కోట్లకు దక్కించుకుంది. 2019 సీజన్‌లో 13 మ్యాచ్‌లాడిన లిన్ 31.15 సగటుతో 405 రన్స్ చేశాడు.

ABOUT THE AUTHOR

...view details