తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్​: స్టార్​ క్రికెటర్లను వదులుకున్న ఆ జట్లు - IPL 2021 Retained and Released Players Full List

మంగళవారం జరిగిన ఐపీఎల్​ రిటెన్షన్ ప్రక్రియ దాదాపు అనుకున్నట్లే సాగింది. కానీ స్మిత్, మ్యాక్స్​వెల్, మలింగ, హర్భజన్​ లాంటి ఆటగాళ్లను సదరు జట్లు వదులుకోవడం అభిమానుల్ని ఆశ్చర్యపరిచింది.

IPL 2021 Retained and Released Players for all 8 teams: Full List
ఐపీఎల్​: స్టార్​ క్రికెటర్లను వదులుకున్న ఆ జట్లు

By

Published : Jan 20, 2021, 7:40 PM IST

ఐపీఎల్​ రిటెన్షన్ ప్రక్రియను జట్లన్నీ మంగళవారం పూర్తి చేశాయి. అట్టిపెట్టుకున్న, వదులుకున్న ఆటగాళ్ల జాబితాను ఆయా ఫ్రాంచైజీలు ట్విట్టర్​ వేదికగా వెల్లడించాయి. అవి మీకోసం.

సన్​రైజర్స్ హైదరాబాద్

మొత్తంగా 22 మంది క్రికెటర్లను రిటైన్ చేసుకుంది హైదరాబాద్​ జట్టు. ఇందులో వార్నర్​, విలియమ్సన్, మనీశ్ పాండే, భువనేశ్వర్​ కుమార్, నటరాజన్, రషీద్ ఖాన్ తదితరులు ఉన్నారు. వదులుకున్న వారిలో స్టాన్​లేక్, సంజయ్ యాదవ్, పృథ్వీరాజ్, అలెన్ ఉన్నారు.

సన్​రైజర్స్ హైదరాబాద్​ ఐపీఎల్ 2021 టీమ్

చెన్నై సూపర్​కింగ్స్

గతేడాది ఐపీఎల్​లో సీఎస్కే తరఫున ఆడని సురేశ్​ రైనాను చెన్నై రిటైన్ చేసుకుంది. ఆరుగురు ఆటగాళ్లను వదులుకుంది. వీరిలో వాట్సన్, హర్భజన్, మురళీ విజయ్, కేదార్ జాదవ్, పియూష్ చావ్లా, మోను సింగ్ ఉన్నారు.

ముంబయి ఇండియన్స్

ఈ సీజన్​ కోసం 18 మంది అట్టిపెట్టుకున్న ముంబయి జట్టు.. ఏడుగురు ఆటగాళ్లను వదులుకుంది. ఇందులో మలింగ, కౌల్టర్​నైల్, మెక్లనగన్, ప్యాటిన్సన్, రూథర్​ఫర్డ్ ఉన్నారు.

ముంబయి జట్టు వదులుకున్న ఆటగాళ్లు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

ఆర్సీబీ జట్టు 12 మంది ప్లేయర్లను రిటైన్ చేసుకుంది. ఆరుగురిని వదిలేసింది. ఈ జాబితాలో మోరిస్, మొయిన్ అలీ, ఫించ్, దూబే, ఉదానా, ఉమేశ్ యాదవ్ ఉన్నారు.

బెంగళూరు ఐపీఎల్ 2021 టీమ్

రాజస్థాన్ రాయల్స్​

రాజస్థాన్ జట్టు స్మిత్​ను వదులుకుంది. అతడి కెప్టెన్సీ బాధ్యతలు సంజూ శాంసన్​కు అప్పగిస్తున్నట్లు వెల్లడించింది. స్టోక్స్, ఆర్చర్, బట్లర్, యశస్వి, మిల్లర్ తదితరుల్ని అట్టిపెట్టుకుంది.

రాజస్ఖాన్ రాయల్స్ కొత్త కెప్టెన్​గా సంజూ శాంసన్

కింగ్స్ ఎలెవన్ పంజాబ్

ఈ జట్టు గేల్, కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, పూరన్, మన్​దీప్ సింగ్, షమి తదితరుల్ని రిటైన్ చేసుకుంది. మ్యాక్స్​వెల్, కరుణ్ నాయర్, విల్​జోన్, సుచిత్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, కాట్రెల్, నీషమ్, కృష్ణప్ప గౌతమ్, తజీందర్ సింగ్​లను వదులుకుంది.

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఐపీఎల్ 2021 టీమ్

దిల్లీ క్యాపిటల్స్

ఈ సీజన్​ కోసం ధావన్, పృథ్వీషా, పంత్, శ్రేయస్ అయ్యర్, రహానె, అశ్విన్​తో పాటు 19 మంది రిటైన్ చేసుకుంది. మోహిత్ శర్మ, తుషార్ దేశ్​పాండే, కీమో పాల్, సందీప్ లామిచానే, క్యారీ, జేసన్ రాయ్ వదులుకున్న ఆటగాళ్లలో ఉన్నారు

దిల్లీ క్యాపిటల్స్ జట్టు

కోల్​కతా నైట్​రైడర్స్

రిటైన్​ చేసుకున్న వారిలో మోర్గాన్, దినేశ్ కార్తిక్, గిల్, నితీశ్ రానా, కుల్​దీప్ యాదవ్​తో పాటు 17 మంది ప్లేయర్లు ఉన్నారు. టామ్ బాంటన్, సిద్దేశ్ లాడ్, క్రిస్ గ్రీన్, నిఖిల్ నాయక్, సిద్ధార్థ్ ఉన్నారు.

కోల్​కతా నైట్​రైడర్స్ ఐపీఎల్ 2021 టీమ్

ABOUT THE AUTHOR

...view details