ఐపీఎల్ 14వ సీజన్ కోసం పంజాబ్ కింగ్స్ ఫ్రాంఛైజీ తమ కొత్త జెర్సీని ప్రకటించింది. ప్రస్తుత జెర్సీ ఎరుపు రంగులో ఉండి అంచుల వెంట బంగారు వర్ణంలో చారలు ఉండేలా తయారు చేశారు. పంజాబ్ కింగ్స్ జెర్సీలో.. సింహం గుర్తు కింద కూడా ఉండే విధంగా డిజైన్ చేశారు.
ఈ ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ కొత్త జెర్సీ ఇదే - పంజాబ్ కింగ్స్
రానున్న ఐపీఎల్ సీజన్ కోసం పంజాబ్ కింగ్స్ తన కొత్త జెర్సీని విడుదల చేసింది. ఈ విషయాన్ని పంజాబ్ ఫ్రాంఛైజీ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది.
ఈ ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ కొత్త జెర్సీ ఇదే
జెర్సీకి తగ్గట్లే బంగారు వర్ణంలో ఉండే హెల్మెట్లను పంజాబ్ బ్యాట్స్మెన్లు ధరించనున్నారు. కాగా, పంజాబ్ తన తొలి మ్యాచ్‌ను వాంఖడే వేదికగా ఏప్రిల్ 12న రాజస్థాన్ రాయల్స్‌తో ఆడనుంది.